మంత్రిగా మారిన టీమిండియా క్రికెటర్.. పోటీ చేసిన మొదటి సారే?

praveen
సినిమాల్లో బాగా రాణించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వారు ఇక ఆ తర్వాత కాస్త వయసు రాగానే రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. అయితే ఒకప్పుడు సినిమాల్లో ఎలాగైతే రానిచ్చేవారో అదే రీతిలో రాజకీయాలలో కూడా తమదైన ప్రసంగాలతో అద్భుతంగా ప్రజలను ఆకర్షించి ఎన్నికల్లో విజయం సాధించి ఇక ఎంతో విజయవంతంగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన వారు కూడా ఉన్నారు.  అయితే మొన్నటి వరకు సినిమా లోనుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని చూసాము కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది క్రికెటర్లు సైతం రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు


 ఎంతమంది క్రికెట్ లో అద్భుతంగా రాణించిన వారు అటు రాజకీయాల్లో కూడా ముందుకు దూసుకుపోతుంటే.. మరికొంతమంది క్రికెట్ లో అంతగా కలిసి రాకపోయినప్పటికీ రాజకీయాలలో మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు అని చెప్పాలి. ఇటీవలే ఓ భారత క్రికెటర్ ఏకంగా మంత్రిగా దూసుకుపోతున్నారు. రెండువేల ఎనిమిదిలో భారత క్రికెట్ జట్టులో అరంగేట్రం చేసిన మనోజ్ తివారి తక్కువ మ్యాచ్ లకే పరిమితం అయ్యాడు  అయితే అతను బాగా ప్రదర్శన చేసినప్పటికీ సీనియర్ల కారణంగా అవకాశాలు దక్కించుకోలేక పోయాడు.



 2018 వరకు ఐపీఎల్ లో కూడా వివిధ జట్లలో ఆడుతూ వచ్చాడు మనోజ్ తివారి.  ఇప్పుడు వరకు అధికారికంగా రిటైర్మెంట్ మాత్రం ప్రకటించలేదు  కానీ అంతలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేసాడు. గత ఫిబ్రవరిలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరాడు మనోజ్ తివారీ. ఈ క్రమంలోనే... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షిబ్ పూర్ నుంచి టిక్కెట్ దక్కించుకున్నాడు.  ఇక ఆ తర్వాత తన ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్థి పై ఆరు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.  అంతేకాదు ఇటీవలమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ మంత్రివర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన క్రికెటర్ మనోజ్ తివారి చోటు దక్కించుకున్నాడు. యువజన, క్రీడ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారి.  ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: