ఐపీఎల్: ముంబై ఇండియన్స్ రాత మారేనా...?

VAMSI
ఐపీఎల్ సీజన్ మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ ఉత్కంఠగా మారుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సారి కొత్త ఐపీఎల్ విన్నర్ ని చూసే అవకాశం లేకపోలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఊహించిన విధంగా మ్యాచ్ లు సాగడం లేదు. ఇకపోతే డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆశలు రాను రాను సన్నగిల్లుతున్నాయి. పేపర్ మీద చూడడానికి ముంబై ఇండియన్స్ జట్టు బలంగా ఉన్నట్టే కనిపించినా...ఆన్ ఫీల్డ్ అంచనాలకు తగినట్లు ఆడడం లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ లలో రెండింటిని గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ముఖ్యంగా ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ప్రత్యర్థి ముందు కాపాడుకోగలిగే లక్ష్యాన్ని ఇవ్వడంలో విఫలమవుతూ ఉంది.

మాములుగా ముంబై ఇండియన్స్ అంటే బ్యాటింగ్ లో చెలరేగిపోతుంది అనే పేరుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను చూసుకుంటే అతి తక్కువ స్కోర్లకే పరిమితమయింది. గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా బౌలర్ల ప్రతిభతో గెలిచారు. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ అంత ఈజీగా ఉండదని నిపుణులు అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్ కూడా ముంబైగా లాగే అల్ రౌండర్స్ పటిష్టంగా ఉన్న జట్టు. కాబట్టి వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండబోతోంది. ఇక మొదటి నుండి క్విన్టన్ డికాక్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఓపెనర్ గా రోహిత్ రాణిస్తున్నా తనకు సహచర ఆటగాళ్ల నుండి సహకారం లభించకపోవడంతో స్వల్ప స్కోర్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కూడా మంచి ఆరంభమే ఇస్తున్నా దాన్ని పెద్ద స్కోర్ గా మలచడంలో ఫెయిల్ అవుతున్నాడు.

ఇకపోతే టీమిండియా యువ కెరటం ఇషాన్ కిషన్ పై పెట్టుకున్న అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు.  మరియు పాండ్యా బ్రదర్స్ బ్యాటింగ్ లో చెలరేగాల్సి ఉంది. కరేబియన్ వీరుడు పోలార్డ్ తనదైన రోజున ఆకాశమే హద్దుగా చెలరేగే సామర్ధ్యం కలవాడు. బౌలింగ్ విభాగంలో సమస్యలు ఏమీ లేనప్పటికీ...జస్ప్రీత్ బుమ్రా పొదుపుగానే బౌలింగ్ చేస్తూనే వికెట్లు అవసరం ఉంది. ఇక ఈ రోజు మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం లో జరగనుంది. ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్ లలో ఒకటి చేజింగ్ గెలవగా...ఇంకొక మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఈ స్టేడియం వికెట్ కొంచెం స్లో గా ఉండే అవకాశముంది. మ్యాచ్ డే టైం లో కాబట్టి మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ కి మొగ్గు చూపే అవకాశం ఉంది. మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలుస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: