వరుసగా ఇంటికి ప్రయాణం అవుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఇక వార్నర్ కూడా..?

praveen
ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రేక్షకులందరికీ మజా డబుల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వరకు ప్రత్యర్థులుగా ఉన్న విదేశీ ఆటగాళ్లందరూ సహచరులు  ఒక జట్టుగా పోరాడుతూ ఉంటారు అంతేకాదు భారత జట్టులో సహచరులుగా ఉన్న ఆటగాళ్లు ఏకంగా ప్రత్యర్థులుగా మారిపోయి పోరాటం చేస్తూ ఉంటారు.  అందుకే ఐపీఎల్ చూడటానికి క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవలే ప్రేక్షకుల అందరూ ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం అయింది. అప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

 అయితే మొన్నటి వరకు అంతా సాఫీగా సాగిపోయినప్పటికి గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు విదేశీ ఆటగాళ్లు బయో బబుల్ పద్ధతిలో ఉంటూ ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు ఈ క్రమంలో వివిధ కారణాలు చెబుతూ ఐపీఎల్ నుంచి తప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్ నుంచి తప్పుకొని ఆయా జట్లకు ఊహించని షాక్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఆండ్రు టై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఆడం జంపా కేన్ రిచర్డ్సన్ బయో బబుల్ వీడి ఆస్ట్రేలియా విమానం ఎక్కేసారు

 ఈ క్రమంలోనే వీరి తరహాలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఇక ఆస్ట్రేలియా బయలుదేరబోతున్నాడు అన్న వార్త వినిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా ఐపీఎల్ వదిలేస్తాడు అని వార్తలు వస్తున్నాయి దీనికి కారణం కూడా లేకపోలేదు ఇండియాలో  వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతుండటంతో పలు దేశాలు ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల పై నిషేధం విడిస్తున్నాయి. ఇక త్వరలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సరిహద్దులు మూసి వేయాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విమానాలు నిషేధించే అవకాశం ఉంది అని భావిస్తున్న ఆటగాళ్లు ఇక ముందుగానే ఐపీఎల్ నుంచి తప్పుకుని స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ స్టీవ్ స్మిత్ కూడా త్వరలో తమ దేశానికి బయలుదేరే అవకాశం ఉన్నట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: