తెలుగోడు విసిరిన బంతికి.. ధోని వికెట్ ఎగిరిపోయింది.. ఫోటో వైరల్..?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి మాజీ ఆటగాడిగా  కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న క్రికెటర్లకు సైతం ధోని కి ఉన్నంత క్రేజ్ లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్లో ఎనలేని సేవలు అందించిన మహేంద్రసింగ్ ధోని దిగ్గజ క్రికెటర్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. కేవలం ఒక క్రికెటర్గా మాత్రమే కాదు ఒక గొప్ప సారథిగా కూడా మహేంద్రసింగ్ ధోని ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అనే విషయం తెలిసిందే.


 అందుకే ఎంతోమంది యువ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడటానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడితే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని భవిష్యత్తును కూడా ఎంతో మెరుగుపరుచుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. అలాంటిది ప్రస్తుతం భారత క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ గా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న మహేంద్రసింగ్ ధోని లాంటి ఆటగాడి  వికెట్ పడగొట్టాడు అంటే ఇక ఆ యువ ఆటగాడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ తెలుగు క్రికెటర్ కి అలాంటి అదృష్టం దక్కింది.



 ఏకంగా దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2021 కోసం ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండు టీములు గా విడిపోయి మ్యాచ్లు ఆడుతుంది. అయితే ఏపీలోని కడప జిల్లాకు చెందిన హరీ శంకర్ రెడ్డి ని ఇటీవల నిర్వహించిన ఐపీఎల్ వేలంలో 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది  ఇక ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హరీ శంకర్ రెడ్డి 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఈ క్రమంలోనే ఏకంగా ధోని బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ ఎగిరి పడి పోయింది. దీనికి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: