కెప్టెన్ గా కోహ్లీకి ముందుకొచ్చి ఆ మాట చెప్పే ధైర్యం ఉందా : సెహ్వాగ్

praveen
ప్రస్తుతం భారత జట్టును ఎంతో సమన్వయంతో ముందుకు తీసుకువెళుతూ భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ.  డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ తీరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఫాలవుతుంది అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్ళ విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయాలపై అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవలే భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ను మొదటి టి20 మ్యాచ్ లో పక్కన పెట్టడం.. ఇక ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో భారత జట్టు పరాజయాన్ని మూట కట్టుకోవడం తో కోహ్లీ కెప్టెన్సీపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.




 ఇంగ్లాండ్తో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ-20 మ్యాచ్ సమయంలో భారత తుది జట్టు గురించి మాట్లాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కు తొలి రెండు టి20 లూ  విశ్రాంతినిస్తు నట్లు వెల్లడించారు. అయితే మ్యాచ్లో ఓపెనర్లుగా శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ ఇద్దరు  కూడా ఫెయిల్ అయ్యారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ లాంటి మంచి జట్టుతో ఆడుతున్న సమయంలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ విరాట్ కోహ్లీని  ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.



 ఇప్పటికే ఈ అంశంపై స్పందిస్తూ కోహ్లీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి కోహ్లీ  కి సూటి ప్రశ్న వేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.  రోహిత్ శర్మ కి తొలి రెండు టి20 లకు రెస్ట్ ఇచ్చినట్లు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు మరి అదే రూల్ విరాట్ కోహ్లీకి వర్తిస్తుందా అంటూ ప్రశ్నించాడు వీరేంద్ర సెహ్వాగ్..  కెప్టెన్గా కోహ్లీ ముందుకు వచ్చి నేను రెండు మూడు మ్యాచ్ లూ  బ్రేక్ తీసుకుంటాను అని చెప్పగలడా..  మరి కెప్టెన్ కి బ్రేక్ అవసరం లేనప్పుడు ఇక మిగతా ఆటగాళ్లకు  ఎందుకు అంటూ ప్రశ్నించాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: