రెండో టెస్టుకు ముందు.. టీమిండియాకు ఊహించని షాక్..?

praveen
ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి దృఢమైనా  ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు ఇటీవలే చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల స్వదేశంలో ఏకంగా ఘోర ఓటమి చవిచూసింది టీమిండియా. రెండు వందల 77 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో సొంతగడ్డపైనే అపజయం పాలు అయింది. దీంతో టీమిండియా తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎంత కీలక పాత్ర పోషించాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 గాయం వేధిస్తున్నప్పటికి కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆటను కొనసాగించి జట్టు కోసం పోరాడాడు. అంతేకాదు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.అయితే..  ఇటీవలే ఇంగ్లాండ్ తో భారత జట్టు ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు ఎంత ముఖ్యం అన్నది అర్థమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మణికట్టు గాయానికి గురైన రవీంద్ర జడేజా ఇక ఇంగ్లాండ్, తో  జరగబోయే రెండు టెస్టులకు దూరంగా ఉంటాడు అని అందరూ అనుకున్నారు.

 కానీ ఆ తర్వాత మాత్రం చివరికి  రెండు టెస్టులకు రవీంద్ర జడేజా  ఆడే అవకాశం ఉంది అని అనుకున్నారు. అయితే రవీంద్ర జడేజా గాయం మానకపోవడం తో ఇక చివరి రెండు టెస్టులకు కూడా రవీంద్ర జడేజా అందుబాటులో ఉండే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఇది టీమిండియాకు ఊహించని షాక్ అనే చెప్పాలి. మణికట్టు గాయం కారణంగా ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స తీసుకుంటున్న రవీంద్ర జడేజా కేవలం టెస్టు సిరీస్లో మాత్రమే కాదు వన్డే టి20 సిరీస్ లకు  కూడా ఆడటం అనుమానమేనని అన్నది క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: