భార్య దూరంగా ఉండడం వల్లే.. స్మిత్ విఫలం అవుతున్నాడట..?

praveen
సాధారణం గా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎప్పుడూ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ.. ఇక ప్రపంచం లోనే  అత్యుత్తమ ఆటగాళ్లలో మొదటి స్థానంలో నిలిస్తూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే.  స్మిత్ మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్మెన్ అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఎలాంటి బౌలర్ నైనా సరే ఎంతో అలవోకగా ఎదుర్కొంటూ భారీ పరుగులు చేస్తూ ఉంటాడు స్మిత్.  ఒక్కసారి మైదానం లోకి బ్యాట్ పట్టుకొని రంగం లోకి దిగాడు అంటే బౌలర్లు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది..


 అయితే ఎప్పుడూ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడి గా ఎంతో అద్భుతం గా రాణించిన స్టీవ్ స్మిత్..  ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న భారత జట్టుతో జరుగుతున్న వరుస సిరీస్లలో వరుసగా విఫలం అవుతూనే ఉండటం ప్రస్తుతం అభిమానుల ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే మొదట జరిగిన వన్డే టి20 సిరీస్ లలో  కాస్త పర్వాలేదు అనిపించినప్పటికీ.. టెస్ట్ సిరీస్ లో మాత్రం ఘోరం గా విఫలం అవుతున్నాడు అనే విషయం తెలిసిందే.



 అయితే నాలుగు ఇన్నింగ్స్ లో  కలిపి స్టీవ్ స్మిత్ కనీసం 10 పరుగులు కూడా చేయలేక పోవడం గమనార్హం. దీన్నిబట్టి స్టీవ్ స్మిత్ ఎంత గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు అన్నది స్పష్టం గా అర్థమవుతుంది. అయితే ఇటీవలే స్మిత్ పేలవ ప్రదర్శన చేస్తూ విఫలం అవుతుండడం పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ హ్యూస్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగు నెలలుగా భార్య కు దూరం గా ఉండటం వల్లే స్మిత్ ప్రస్తుతం మానసికంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే భారత్పై స్మిత్ సరిగా ఆడ లేక పోతున్నాడని..కరోనా నిబంధనలు  అతనిపై  ప్రభావం చూపాయి అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: