అప్పుడు బూమ్రా.. ఇప్పుడు నట్టు.. అంతా సేమ్ టు సేమ్..?
అయితే ఇటీవలి ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో యార్కర్ లతో బిసిసిఐ సెలక్టర్ల చూపు ఆకర్షించిన నటరాజన్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులో స్థానం సంపాదించుకుని తక్కువ సమయంలోనే తన ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. పదునైన యార్కర్ లు సంధిస్తూ ఆస్ట్రేలియా బ్యాట్ మెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు నటరాజన్. అయితే బూమ్రా నటరాజన్ ఇద్దరి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. ప్రస్తుతం నటరాజన్ లాగే బుమ్రా కూడా ఒకప్పుడు సహచర ఆటగాళ్లు గాయపడినప్పుడు మాత్రమే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇద్దరు ఆస్ట్రేలియా గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ లో కాలుమోపారు.
2016 షమి స్థానంలో బుమ్రా అరంగేట్రం చేస్తే 2020లో సైని స్థానంలో నటరాజన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇద్దరు ఎంట్రీ ఇచ్చింది కూడా సిరీస్లో చివరి వన్డే కావడం గమనార్హం. అంతేకాదు ఆ సిరీస్లో టీమిండియా గెలిచింది కూడా వీరు అరంగేట్రం చేసినా మ్యాచ్లోనే కావడం గమనార్హం. తొలి వన్డేలో బుమ్రా రెండు వికెట్లు తీయగా నటరాజన్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు... ఇక ఆ తర్వాతతొలి టీ20లో బూమ్రా మూడు వికెట్లు పడగొట్టగా నటరాజన్ కూడా మూడు వికెట్లు తీశాడు. దీంతో రానున్న రోజుల్లో బూమ్రా స్థాయిలో నటరాజన్ కూడా ఎదుగుతాడని ప్రస్తుతం ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.