జట్లు కోహ్లీ లేకపోతే కష్టమే... కానీ.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..?

praveen
ఇటీవలే ఐపీఎల్ టోర్నీలో భారత ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారిపోయి హోరాహోరీగా తలపడ్డారు అన్న  విషయం తెలిసిందే. ఇక కొంత మంది ఆటగాళ్లు విజయం సాధిస్తే మరికొంత మంది ఆటగాళ్లు ఐపీఎల్లో నిరాశ ఎదుర్కొన్నారు. కాగా ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ మళ్లీ ఒక జట్టుగా ఏర్పడి ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 3 టి20 లు మూడు వన్డేలు నాలుగు టెస్ట్ సిరీస్ లు  ఆడనుంది భారత జట్టు. ఇప్పటికే కరుణ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో గడుపుతున్న భారత ఆటగాళ్లు క్రమక్రమంగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.



 ఇకపోతే కరోనా వైరస్ తర్వాత మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఎలా రాణిస్తోంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అదే  సమయంలో భారత జట్టులో కీలక ఆటగాడు... కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉండడంతో ప్రస్తుతం జంతుప్రదర్శన ఎలా ఉండబోతోంది అనే దాని పై మరింత ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరి నెలలో బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆ సమయంలో భార్య కు తోడుగా ఉండాలని భావించి పితృత్వ సెలవులకు దరఖాస్తు చేసుకోగా బీసీసీఐ సానుకూలంగా స్పందించింది.



 దీంతో మొదటి టెస్ట్ కి విరాట్ కోహ్లీ దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా ఇదే విషయంపై మాట్లాడినా... భారత మాజీ ఆటగాడు క్రికెట్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీ టీమిండియా పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లీ చివరి మూడు టెస్ట్ లకు అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం అంటూ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో ప్రతి ఆటగాడు కీలకమని 2018-19 లో రానించ్చినట్లుగానే సమిష్టిగా ఆటగాళ్లందరూ రాణించాలని.. సెలెక్ట్ కమిటీ తీసుకున్న కెప్టెన్సీ నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు అభిప్రాయం వ్యక్తం చేశారు సన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: