ఆటగాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ..?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరం గా సాగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భారత ఆటగాళ్లు అందరూ ఎంతో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అయితే ఐపీఎల్ టోర్నీ ముగియగా నే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు బిసిసిఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం జట్టు ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది బిసిసిఐ. దీనికి సంబంధించి అన్ని రకాల కసరత్తులు చేస్తోంది. జట్టు ఆటగాళ్లు కూడా ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటన కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న ఆటగాళ్లు ముందుగా అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకోనున్నారు.



 అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి కారణం గా భారత్లో కాకుండా యూఏఈ లో ఐపీఎల్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ల యొక్క కుటుంబాలకు అనుమతి ఇవ్వలేదు అన్న విషయం తెలిసిందే. కాని ఆస్ట్రేలియా పర్యటనకు ఆటగాళ్లందరూ తమ కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఇది ఆటగాళ్లు అందరికీ శుభ వార్త అనే చెప్పాలి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే టి20 టెస్ట్ ఫార్మాట్ లో కూడా టీమ్ ఇండియా మ్యాచ్ లు  ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో నిన్నటి వరకు తమ జట్టు ఆటగాళ్లు గా ఉన్న ఆస్ట్రేలియా ప్లేయర్లు తమకు ప్రత్యర్థులుగా మారిపోయే అవకాశం ఉంది.



 అయితే గతంలో కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య ఆటగాళ్ళ కుటుంబ సభ్యులకు ఆటగాళ్లతో ఉండటానికి అనుమతి నిరాకరించింది బీసీసీఐ. కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ కోసం ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో వెళ్ళవచ్చు అంటూ బిసిసిఐ అనుమతి ఇచ్చింది. కొంతమంది సీనియర్ ఆటగాళ్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ తెలిపింది బీసీసీఐ.  కాగా నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మ్యాచ్ మొదలు కానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: