సీఎస్కే ఓటమి.. ధోని అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీ..?

praveen
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు ప్రతి సీజన్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడు టైటిల్ ఫేవరెట్ జట్టు గానే అదరగొడుతోంది. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో కూడా టాప్ ప్లేస్ లో  నిలుస్తూ ఉంటుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ధోనీ సారథ్యంలో ప్రతి ఒక ఆటగాడు తన అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఉంటారు. ఇక మొదటి మ్యాచ్ లో  డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ను  అలవోకగా మట్టికరిపించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.



 ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో తమ రెండవ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరికి 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు ఓటమి పాలైనప్పటికి  అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదేంటి అభిమాన జట్టు ఓటమి పాలైతే... అభిమానులు హ్యాపీగా ఉండటం ఏంటి అని అనుమానం మీకు కలగొచ్చు. అయితే మొదటి మ్యాచ్ లో  డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై  విజయం సాధించినప్పటికీ ధోని ఆట చూడాలని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిన్నటి మ్యాచ్ లో  కూడా నిరాశే ఎదురవుతుంది అనుకున్నారు అభిమానులు.



 కానీ ఎట్టకేలకు ధోనీ మైదానంలోకి మ్యాచ్ చివరి లో అడుగుపెట్టాడు. ఇక ఎక్కువగా డుప్లెసిస్ కే  అవకాశం ఇస్తూ ధోని కేవలం స్ట్రయిక్  ఇస్తున్న నేపథ్యంలో ధోని మెరుపు సిక్స్ ఇప్పట్లో చూడలేమా అని అందరూ అనుకున్నారు అభిమానులు. మ్యాచ్  ఓడిపోతుంది అని తెలిసినప్పటికీ.. ఇంకా టీవీల ముందు కూర్చొని ధోనీ ఒక్క  హెలికాప్టర్ షాట్ కొట్టక  పోతాడా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో అభిమానులు కోరుకున్నట్లుగానే ధోని విజృంభించాడు. వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఇక అందులో ఒక సిక్స్ స్టేడియం బయట పడి ఏకంగా ఒక హోటల్ లోకి వెళ్లి పోయింది. ఇక ధోని ఆటను చూసి అభిమానులు అందరూ  జట్టు ఓడింది  అన్న విషయాన్ని మరచిపోయి మరి ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: