రైనా, హర్భజన్ లేకపోయినప్పటికీ చెన్నై గెలవగలదు..?
వాస్తవం గా చెప్పాలంటే తాను ఐపీఎల్ లీగ్ ఎంతగా నో మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చిన హర్భజన్ సింగ్... మొదటినుంచి ఐపీఎల్ లో తాను భాగమయ్యాను అంటూ గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ ఏడాది పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉన్నాయని... ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కుటుంబంతో కలిసి ఉండేందుకు తాను ప్రాధాన్యం ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. సిఎస్కే జట్టు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు హర్భజన్ సింగ్. ఏ జట్టు అయినా విజయం సాధించవచ్చు అంటూ తెలిపిన హర్భజన్ సింగ్ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటూ తెలిపారు.
అయితే ఈ టైటిల్ గెలిచే సత్తా చెన్నై కి ఉంది అంటూ తెలిపిన హర్భజన్... ఆ జట్టులో సురేష్ రైనా, హర్భజన్ లేకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అంటూ తెలిపారు. ఎందుకంటే చెన్నై జట్టులో ఎంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్. కాగా ఇటీవలే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.