ధోనిని కెప్టెన్ గా తీసేద్దాం అనుకున్నారు.. కానీ నేనే అడ్డుకున్నా..?

praveen
భారత క్రికెట్ దిగ్గజం మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కు వీడ్కోలు పలికి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించడంపై  ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తు  ధోని క్రికెట్ లో చేసిన సేవలను కొనియాడుతూ ఉన్నారు. భారత క్రికెట్ జట్టును ఎంతలా  ముందుండి నడిపించాడు అనే విషయాన్ని గుర్తుచేసుకుంటూ ధోనీ సారథ్యం   పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోనీ రిటైర్మెంట్ పై అటు అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో సత్తా చాటిన  తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించి వచ్చే ప్రపంచ కప్ను ధోనీ గెలిపించి పెడతాడు అని అనుకుంటే... ఉన్నపలంగా  రిటైర్మెంట్ ప్రకటించడం పై ధోని అభిమానులు అందరూ షాక్ కి గురయ్యారు.



 షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు పోతున్నారు ధోని  అభిమానులు. అయితే ధోని భారత క్రికెట్ చరిత్రలో ఎంతో విజయవంతమైన కెప్టెన్గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే, ఇప్పటివరకు ఏ కెప్టెన్ కి  కూడా సాధ్యం కానిది  మహేంద్ర సింగ్ ధోనీ రెండు ప్రపంచ కప్ లను భారత జట్టుకు అందించాడు, భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్  కూడా రెండు  ప్రపంచ కప్ లను  భారత్ కు  అందించలేదు. ఆటగాళ్లను ముందుండి నడిపించడంలో... ఎంత ఒత్తిడిలో అయినా ఎంతో కూల్ గా  నిర్ణయాలు తీసుకోవడంలో... గెలుపు ఓటములను సమాంతరంగా చూడటంలో ధోని ఎప్పుడు అందరికంటే భిన్నంగా ఉంటాడు అనే చెప్పాలి,



 అయితే ధోనీ కెప్టెన్సీపై తాజాగా బిసిసిఐ మాజీ  అధ్యక్షుడు శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనిని  కెప్టెన్ గా తొలగించాలి అనుకున్నప్పుడు పట్టు భట్టి  మరి ధోనీ కెప్టెన్గా కొనసాగేలా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. 2011లో ధోనీ కెప్టెన్సీలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన అనంతరం... ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా లతో టెస్టు సిరీస్లో చిత్తుగా భారత జట్టు ఓడిందని..  ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్గా ధోనీని  తొలగించి వేరొకరిని నియమించాలని సెలక్షన్ కమిటీ భావించింది అని చెప్పుకొచ్చారు శ్రీనివాసన్. కానీ ఆ సమయంలో బిసిసిఐ అధ్యక్షుడిగా ఉన్న తాను తన విశేషాధికారాలను ఉపయోగించి ధోనిని  తప్పించకుండా అడ్డుకున్నట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: