టాప్ 10 లో టీమ్ ఇండియా నుండి ఆ ఇద్దరికీ చోటు దక్కింది..వెనకబడ్డ కోహ్లీ..?
భారత్లో ఆటగాళ్లందరూ గత కొంత కాలంగా తన సత్తా చాటుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఏదైనా పరుగుల వరద పారిస్తూ అద్భుత ప్రదర్శన చేస్తూ మ్యాచ్ కి విజయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆటగాళ్ళు . ఒక ఆటగాడు ఫెయిల్ అయిన... ఇంకో ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన తో అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే వారి రాంకింగ్స్ ని కూడా మెరుగు పరుచుకుని పైకి ఎగబాకుతూ వస్తున్నారు ఇండియన్ ఆటగాళ్ళు. మరోవైపు రికార్డ్ ల మీద రికార్డ్ లు సైతం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇండియా ఆటగాళ్లు సరికొత్త రికార్డును నెలకొల్పింది కోకొల్లలు. అయితే టీం ఇండియాలో ఉన్న ఆటగాళ్లు చాలామంది... అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతగానో అలరిస్తున్నారు.
అయితే తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో బ్యాటింగ్ విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజమ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. పించ్, మాలాన్ 2, 3 స్థానాల్లో కొనసాగుతుండగా.. ఐసిసి టీ20 ర్యాంకింగ్స్ లో ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్ దక్కింది. కె.ఎల్.రాహుల్ ఆరవ స్థానంలో... విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్ లో ఉండగా... ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఐసీసీ ప్రకటించిన టి20 ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో భారత ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం గమనార్హం.
అయితే తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా కె.ఎల్.రాహుల్ కోహ్లీ దాటుకుని పైకి ఎగబాకాడు. ఏకంగా కోహ్లీ 9వ స్థానంలో నిలిస్తే కేఎల్ రాహుల్ మాత్రం ఆరో స్థానంలో నిలిచి తన సత్తా చాటాడు. అయితే గత కొంత కాలంగా కె.ఎల్.రాహుల్ అద్భుత ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. అటు విరాట్ కోహ్లీ కూడా తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్లో కేఎల్ రాహుల్ భారీ స్కోరు నమోదు చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ పలు మ్యాచ్ లలో తడబడినప్పటికీ కొన్ని మ్యాచుల్లో విజృంభించి ఆడి మరి భారీ స్కోరు నమోదు చేస్తున్నారు.