భువనేశ్వర్ వణికించాడు.. శిఖర్ ధావన్ దంచేశాడు..

frame భువనేశ్వర్ వణికించాడు.. శిఖర్ ధావన్ దంచేశాడు..

Chakravarthi Kalyan
దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సీరిస్ కైవసం చేసుకున్న భారత్.. అదే జోరు కొనసాగిస్తోంది. టీ 20 సీరిన్ లోనూ సఫారీలోను వణికిస్తోంది. అదీ ఇదీ అని చూడకుండా ఫార్మాట్ ఏదైనా విజయం తమదే అని నిరూపిస్తున్నారు. మొదటి టీ 20 ను 28 పరుగుల తేడాతో గెలుచుకుని శుభారంభం చేశారు. బ్యాట్స్ మెన్, బౌలర్లు సమిష్టిగా రాణించి సూపర్ విజయాన్ని అందించారు. 


శిఖర్ ధావన్ బ్యాట్ తో మాయాజాలం చేశాడు.. కేవలం 39 బంతుల్లోనే 72 పరుగులు పిండేశాడు.. ఇందులో 10 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినవారూ అదే జోరు కొనసాగించారు. దీంతో దక్షిణాఫ్రికాపై టీ20ల్లో భారత్‌ అత్యధిక పరుగుల రికార్డు నెలకొల్పింది. ఇక ఆ తర్వాత పేసర్ భువనేశ్వర్ బంతితో తన సత్తా చాటాడు. 
ప్రారంభంలోనే సఫారీలను సఫా చేసేశాడు.. 

PACER BHUVANESWAR కోసం చిత్ర ఫలితం


ఏకంగా ఐదు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాకు విజయంపై ఆశలు లేకుండా చేసేశాడు భువనేశ్వర్. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ లో ఒక్క హెన్‌డ్రిక్స్‌ మాత్రమే 70 పరులు చేసి పోరాడినట్టు కనిపించాడు. సో.. మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది.  సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 2014 ఏప్రిల్‌ తర్వాత సఫారీలపై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి. బంతితో మాయ చేసిన భువనేశ్వర్ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కించుకున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: