భారతదేశంలో దేవాలయాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఎక్కువ దేవాలయాలు ఉంటూ ఉంటాయి. ఇక ఏదైనా ప్రసిద్ధి పొందిన దేవాలయం ఉంది అంటే దాని చుట్టు పక్కల కూడా పెద్ద ఎత్తున దేవాలయాలు ఉంటాయి. ఇకపోతే భారత దేశంలో అత్యధిక దేవాలయాలు కలిగిన టాప్ 7 రాష్ట్రాలు ఏవి ..? ఆ రాష్ట్రాలలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.
రాజస్థాన్ : రాజస్థాన్ రాష్ట్రం భారతదేశంలో ఎక్కువ దేవాలయాలు కలిగి ఉన్న లిస్ట్ లో ఏడవ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో 39000 దేవాలయాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ : భారతదేశంలో అత్యధిక దేవాలయాలు కలిగి ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 47000 దేవాలయాలు ఉన్నాయి.
గుజరాత్ : భారత దేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ 5 వ స్థానంలో ఉంది. ఇక్కడ 50000 దేవాలయాలు ఉన్నాయి.
పశ్చిమబెంగాల్ : భారతదేశంలో అత్యధిక దేవాలయాలు కలిగి ఉన్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ 4 వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 53500 దేవాలయాలు ఉన్నాయి.
కర్ణాటక : మన దేశంలో అత్యధిక దేవాలయాలు కలిగిన రాష్ట్రాలలో కర్ణాటక 3 కే స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 61000 వేల దేవాలయాలు ఉన్నాయి.
మహారాష్ట్ర : మన దేశంలో అత్యధిక దేవాలయాలు కలిగి ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర 2 వ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 77000 దేవాలయాలు ఉన్నాయి.
తమిళనాడు : భారత దేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న రాష్ట్రాలలో తమిళ నాడు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 79000 దేవాలయాలు ఉన్నాయి.
ఇలా మన దేశంలో అత్యధిక దేవాలయాలు కలిగిన టాప్ 7 రాష్ట్రాలలో ఈ రాష్ట్రాలు ఉన్నాయి.