వివాహ ప్రయత్నాలు ఫలించడం లేదా..? అయితే ఇలా చేసి చూడండి..!

Divya
కొంతమంది ఇళ్లలో కానీ,బంధువుల ఇళ్లలో కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరక,బందువులలో కలవాలన్నా కలవలేక పోతుంటారు.ఇంకొంత మందికి అన్ని కుదిరి పెళ్ళి వరకు వచ్చినా కూడా ఎగిరిపోతుంటాయి.దానికి కారణం వారి జాతకంలో దోషాలైనా,లేక ఇంట్లో ఉన్న వాస్తు దోషాలైనా కావొచ్చునని వేద పండితులు చెబుతున్నారు.అలాంటి వారికి పసుపుతో కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల దోషాలు తొలుగుతాయని పండితులు,పురాణాలూ చెబుతున్నాయి.అలాంటి పరిహారాలు ఏంటో, చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా పసుపును వంటల్లో వాడటమే కాక పూజల్లో కూడా ప్రత్యేక స్థానం ఉంది.ఇలాంటి పసుపుతో చేసే నివారణలు దోషాలను పోగొడతాయి.చాలా మందికి జాతకంలో ఎక్కువగా కుజ దోషం వున్నవారికి,పెళ్లిళ్లు కాక,మరియు ఒకవేళ ఆయన కూడా భార్యాభర్తల మధ్య సమస్యలతో తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ప్రతి శనివారం విష్ణు ఆలయానికి వెళ్లి, పసుపు బట్టలతో విష్ణువుకు పసుపు కుంకుమ అర్చన చేయించడం వలన,మరియు పసుపు బట్టలు, పసుపు రంగులో వున్న పండ్లు, పసుపు రంగులో ఉన్న ధాన్యలు దానం చేయడం వల్ల కుజ దోషాలు తొలగి,పెళ్లిళ్లు తొందరగా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఈ పరిహారాన్ని ఏడు శనివారాల పాటు చేయడం ఉత్తమం.
ఇంట్లో ప్రతికూల భావనలు కలిగిన వారు పసుపు వేసిన నీటితో ఇళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల,ఇంట్లో సానుకూల భావనలు పెరిగి,పెళ్లి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి.మరియు ప్రధాన ద్వారం వాకిలికి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి,పూలతో గుమ్మాన్ని పూజించడం వల్ల ఇంట్లోకి ఎనర్జీ రావడం మొదలవుతుంది.
ఇంట్లో ఈశాన్యం మూల ఎక్కువగా ఉన్నవారికి కూడా పెళ్లిళ్లు తొందరగా జరగకపోవడం మరియు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి.అలాంటి వారు  ఇంట్లో ఈశాన్యం మూలను తగ్గించుకునేందుకు గోడ కట్టి,ఆ గోడపై స్వస్తిక్ గుర్తు వేసి పూజలు నిర్వహించడం వల్ల,వాస్తు దోషాలు తొలుగుతాయి.ఎవరికైనా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు,సమస్యలు ఉన్నట్లయితే,అటువంటివారు పార్వతీ సమేత పరమేశ్వరుని పసుపుతో అభిషేకం చేసినట్లయితే వారి మధ్య సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: