భార్యభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే..ఇలా చేసి చుడండి..!

Divya
ప్రతి కుటుంబంలోను చిన్న చిన్న సమస్యలు, అప్పుడప్పుడు మనస్పర్థలు సర్వసాదారణం.ఎవరింట్లో దోశే వేస్తే రంద్రాలు ఉండవు చెప్పండి.అందుకే ఇంటింటికో రామాయణం అని వూరికే అన్నారా పెద్దలు. కానీ కొందరి ఇళ్లలో మాత్రం మాట మాట్లాడితే గొడవలుతోనే మొదలై,గొడవతోనే ముగుస్తూ ఉంటుంది.దానికి కారణం భార్యకయినా,భర్తకయినా వారి జాతకల్లో కుజదోషం ఉండటమే అంటున్నారు జోతిష్య శాస్త్రనిపుణులు.మన జాతకాల్లో గొచరించే గ్రహాలను బట్టి కూడా మన జీవితం కొనసాగుతుంది.
ఎవరికైతే జాతకంలో కుజుడు సరైనా స్థానంలో సంచరించకపోతే,వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కుజుడు స్థానం బలంగా ఉంటే వారి జీవితం సాఫి జరుగుతుంది.
కుజదోషం వున్నవారికి,ఆలస్యంగా పెళ్ళి అవ్వడం మరియు అయిన తరువాత కూడా భార్యభర్తలమధ్య సక్యత లేకపోవడం వంటివి జరుగుతాయి.ఇలానే వీరి గొడవలు కొనసాగితే,పిల్లలపై ప్రభావం చూపడమే కాకుండా,భార్యభర్తలు విడాకుల వరకు వెళ్లాల్సివస్తుంది.కావున ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కుజ దోషానికి విరుగుడు చేసుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు.కుజదోషం పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పరిహారాలను పాటించడం వల్ల మన జాతకంలో స్థానం బలంగా ఉంటుంది.మరియు అంగారకుడు బలహీనంగా ఉండడం వల్ల మంగళ దోషం ఉంటుంది. కావున ఇలాంటి కుజదోషంతో బాధపడేవారు ప్రతి మంగళవారం ఇంట్లో ఆంజనేయస్వామికి పూజలు చేసి, ఎర్రచందనం,బెల్లము సమర్పించాలి.ఆ తర్వాత బెల్లంను తీసుకొని ఆవుకు పెట్టాలి.లేదా ఎవరైనా బ్రాహ్మణునికి కూడా దానం ఇవ్వవచ్చు.ఇలా 7 మంగళ వారాల పాటు దానం ఇవ్వడం వల్ల కుజదోషములకు పరిహారం కలుగుతుంది.మరియు పూజలు భార్యాభర్తల అనువర్తనంలో జరిగితే,వారి మధ్య సఖ్యత కుదిరి గొడవలు తగ్గుముఖం పడతాయి.భార్య జాతకంలో కుజదోషం ఉన్నట్లయితే,ఆమె తమ్మునికి కానీ,అన్నకు కానీ నోటిని తీపి చేయడం వల్ల,వారి చల్లని చూపుతో ఆమెకు దోష నివారణ కలుగుతుంది.అదే భర్త విషయంలో ఉన్నట్లయితే, అతను తన చెల్లి కానీ అక్కకానీ తాంబూలం, ఎర్రటి వస్త్రం ఇచ్చి,నోరు తీపి చేయడం ఉత్తమం.మరియు భార్యాభర్తల విషయాలు వారి మధ్యలోనే ఉంచితేనే,వారి కుటుంబం సుఖశాంతులతో నిండి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: