పేదరికాన్ని సైతం పోగొట్టే లక్ష్మి గవ్వల ముడుపు ఎలా కట్టాలో తెలుసా..?

Divya
మన దేశంలో ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తూన్న,వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా సంపాదించిన ధనం,వారి రోజువారి ఖర్చులకు కూడా సరిపోక,ఆకలి కేకలతో కటిక పేదరికం అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఎంత కష్టపడినా కలిసి రాక, భార్యాబిడ్డలను పోషించలేక చాలా బాధలను అనుభవిస్తూ ఉంటారు. అలాంటివారు శనివారం పూట లక్ష్మీ గవ్వలతో కట్టే ముడుపు కటిక పేదరి కాని సైతం పోగొట్టగలదని వేద పండితులు సూచిస్తున్నారు. అంతటి శక్తి గల లక్ష్మీ గవ్వల ముడుపును ఎలా కట్టాలో తెలుసుకుందాం..
ప్రతి శనివారం, వెంకటేశ్వర స్వామికి వేడుకొని లక్ష్మీ గవ్వల ముడుపు కడితే,ఆ కలియుగ ప్రత్యక్ష దైవము  పేదరికం పోగొట్టగలడని పెద్దలు చెబుతుంటారు. దీనికోసం శనివారం పూట ఉదయాన్నే నిద్ర లేచి, తల స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని అందులో,కుబేర యంత్రం వేసి, ఎర్రటి పువ్వులను ఏడు తీసుకొవాలి.ఆ కుబేర యంత్రం పై పీఠం వేసి, వెంకటేశ్వర స్వామి పటం పెట్టి, పళ్ళు పూలను సమర్పించాలి.

ఆ తర్వాత 11 లక్ష్మీ గవ్వలను తీసుకొని, చిటికెడు కుంకుమపువ్వు నీటిలో వేసి, రంగు మారాక, ఎర్రటి గుడ్డ ముక్క తీసుకొని పసుపు,కుంకుమ వేసి లక్ష్మీ గవ్వలను ఉంచి, ముడుపు కట్టాలి. ఈ ముడుపును 7 శనివారాలపాటు అలాగే పెట్టి,లక్ష్మీ మంత్రమును జపించాలి. ఆ తరువాత ఎనిమిదో శనివారం మనం డబ్బు ఉంచుకొని బీరువాలో కానీ, వ్యాపార సంస్థలో డబ్బు పెట్టే ప్రదేశంలో కానీ పెట్టడం వల్ల ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చి ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది.దీని ద్వారా సుఖ సంతోషాలు కలిగి కటిక పేదవారైనా కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. కావున పేదరికంతో బాధపడే ప్రతి ఒక్కరు ఖర్చులను తగ్గించుకొని,ఆ కలియుగ దైవము యందు నమ్మకంను ఉంచి,ఈ ముడుపు కట్టుకోవడం వల్ల పేదరికం నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: