గుడిలో మూడు సార్లు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి..?

Divya
హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ దేవుడి గుడికి వెళ్ళినా,ఆలయం ప్రాంగణంలో ఉన్న గంటను మూడుసార్లు కచ్చితంగా కొడతాము.అస్సలు గంట ఎందుకు కొట్టాలంటే, మన మనసులో ఎన్నో గందరగోళాలు, ఆందోళనలతో గుడికి వెళ్తాము. అవన్నీ మరిచి,మానసిక ప్రశాంతతలతో దేవుడి యందు మనసు లగ్నం చేయడానికి గంటను మోగిస్తాము. అందులో నుంచి వచ్చే ఓంకార నాదం మన చెవులు నుండి వెళ్లి, మన శరీరంలోని శబ్ద తరంగాలకు సంధానం ఏర్పడి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరియు దేవుడికి ఏ కోరిక అయితే సమర్పిస్తామో అది ఆయన శ్రద్దగా విని తప్పక నెరవేరుస్తాడని ప్రజల యొక్క నమ్మకం. అంతేకాక ప్రసాదం సమర్పించినప్పుడు,హారతి ఇచ్చినప్పుడు గంటను మ్రోగించాలి అని శాస్త్రం చెబుతోంది. హిందూ పూజా విధానంలో ప్రతి ఘట్టం వెనుక చాలా ఆంతర్యాలు కలిగి ఉంటాయి. అలాగే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మూడుసార్లే ఎందుకు గంట కొట్టాలనే దాని వెనక కూడా ఖచ్చితమైన ఆంతర్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఒక్కసారి గంట మ్రోగిస్తే..
ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంటను మ్రోగించడం వల్ల అది మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి.కుటుంబం సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము.కావున ఎవరూ కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంట మ్రోగించకూడదు.
 రెండుసార్లు గంట మ్రోగిస్తే..
దేవాలయంలో దేవుడు ముందు రెండు సార్లు గంట మ్రోగించి, వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్టు అర్థం. కావున ఎవరూ కూడా రెండుసార్లు గంట మ్రోగించకూడదని,పురాణాలు హెచ్చరిస్తున్నాయి.
మూడుసార్లు గంటా మ్రోగిస్తే..
దేవుడి ముందు మూడుసార్లు గంట మ్రోగించడం వల్ల శరీరమునకు,మనసుకు సుఖశాంతులు కలుగుతాయి . ఈ విధానాన్ని దేవాలయ గంట నాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది. కావున దేవుడి ముందు మనసు లగ్నం చేయడానికి, పండ్లు ప్రసాదాలు సమర్పించినప్పుడు, మూడుసార్లు గంట మ్రోగించడం చాలా మంచిదని పురాణాలను అవపోసన పట్టిన పండితులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: