అక్కినేని ఫ్యామిలీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా.. అలా పెళ్లి చేసుకోబోతున్న అఖిల్..!?
వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చాలా సాంప్రదాయ బద్ధంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు అక్కినేని ఇంటి బాధ్యతలను అప్పుడే తీసేసుకుంది శోభిత ధూళిపాళ్ల అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇలాంటి మూమెంట్లోనే అక్కినేని అఖిల్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే శ్రేయ భూపాల్ ను ప్రేమించి నిశ్చితార్ధం చేసుకున్న అక్కినేని అఖిల్ ఆ తర్వాత ఆమెకు బ్రేకప్ చెప్పేసాడు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత దూరం దూరంగా ఉంటూ వచ్చారు.
తాజాగా అక్కినేని అఖిల్ జైనబ్ అనే అమ్మాయితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త కూతురు . వేల కోట్ల ఆస్తికి వారసురాలు . ఆమెతో నిశ్చితార్థం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు అక్కినేని అఖిల్ . త్వరలోనే వీళ్ల పెళ్లి జరగబోతుంది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే అఖిల్ పెళ్లి తెలుగు సాంప్రదాయ ప్రకారం కాకుండా ముస్లిం సంప్రదాయ ప్రకారం చేయబోతున్నారట . ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అక్కినేని నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు . రెండు కూడా సంప్రదాయ బద్దంగానే చేసుకున్నాడు . నాగచైతన్య కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు . నాగచైతన్య కూడా రెండు సాంప్రదాయ బద్ధంగానే చేసుకున్నారు . అయితే అక్కినేని అఖిల్ మాత్రం మొదటి పెళ్లి తెలుగు సాంప్రదాయ ప్రకారం జరుపుకోవాలనుకున్నాడు .అది అలాగే ఢమాల్ అంటూ పోయింది. రెండో పెళ్లి మాత్రం ముస్లిమ్స్ పద్ధతి ప్రకారం చేసుకోబోతున్నారట . ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!