శివుని అనుగ్రహం పొందాలి అంటే ఈరోజు ఇలా చేయండి..?

Divya

ఈరోజు మహాశివరాత్రి కనుక రాత్రి 8:02 నిమిషాలకు ప్రారంభమై రేపటి రోజున సాయంత్రం 4:18 నిమిషాల వరకు కొనసాగుతుంది. శివుడికి అంకితమైన ఈ రోజున ఎంతో చాలా పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తూ ఉంటారు. పురాణాలలో శివరాత్రికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉందని చెప్పవచ్చు.అందుకే శివరాత్రి రోజున దైవ క్షేత్రాలన్నీ భక్తులతో చాలా సందడి చేస్తూ ఉంటాయి. పరమ శివుడిని పార్వతిని పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది తెలియజేస్తున్నారు పండితులు. ముఖ్యంగా ఈ రోజున శివుడిని పూజించేటప్పుడు బిల్వ ఆకులు, తేనె ,పాలు, పెరుగు, పంచదార, గంగాజలంతో అభిషేకం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున చేయవలసిన పనులు ఏంటి చేయకూడని పనులేంటో ఒకసారి చూద్దాం.
1). ఉదయం లేవగానే కచ్చితంగా స్నానం చేయాలి.. అలా చేసిన వెంటనే సుబ్రహ్మణ్యం దుస్తులను ధరించాలి.

2). ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదట.
3). ఈ రోజున ఏదైనా శివాలయంలోకి వెళ్లి శివుడిని నీరు పాలు ద్వారా అభిషేకం చేస్తే మరీ మంచిదట.

4). మహాశివరాత్రి రోజున ఓం నమశ్శివాయ అని చెప్పించాలి.

5). ఈరోజు ఉపవాసం తో పాటు రాత్రి జాగారం ఉంటే శివుడి కృప లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.
చేయ కూడని పనులు ఏంటంటే..
1). శివరాత్రి పర్వదినాన పప్పులు బియ్యం గోధుమలతో చేసిన ఆహారాన్ని అసలు తినకూడదు.
2). కొంతమంది వేద పండితులు తెలిపిన ప్రకారం ఈ రోజున అసలు నల్ల బట్టలు ధరించ కూడదట.
3). శివునికి ఈరోజు సమర్పించే నైవేద్యాన్ని అసలు ఎంగిలి చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.
4). ఈ రోజున ఉపవాసం ఉన్నవారు నిద్రపోకపోవడం చాలా మంచిది.
5). ముఖ్యంగా ఈ రోజున ఎలాంటి మాంసం మద్యం వంటివి అసలు సేవించ కూడదు.ఇవే కాకుండా అని మరి కొన్ని కూడా ఉన్నాయి.

ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ నిబంధనలను పాటిస్తూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: