మేడారం జాతర గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు?
మేడారం జాతర సందడి మొదలైంది.. తెలంగాణలోనే కాదు.. దక్షిణ భారతంలోనే అతి పెద్ద జాతరగా దీనికి పేరు ఉంది. ఈ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరుగుతుంది. తాడ్వాయి మండలంలో ఈ మేడారం ఉంది. సమ్మక్క చిన్నతనంలో పులుల మధ్య ఆడుకుందని చెబుతారు. ఆమెను గిరిజనులు గ్రామానికి తీసుకొచ్చాక ఆమె తన మహిమలు చూపిందని చెబుతారు. అయితే.. ఈ మేడారం జాతర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన పది విషయాలు తెలుసుకుందాం..
ఒకటి.
మేడారం జాతర దేశంలోనే ఎక్కువ మంది పాల్గొనే జాతరల్లో ఒకటి.. కుంభమేళా తరువాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరేనట.
రెండు.
మేడారంలో రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఇది ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర చూసి తరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తారు. ఈసారి కోటిమంది వస్తారని అంచనా.
మూడు.
మేడారం జాతర గిరిజనుల జాతర.. ఇది ప్రతి రెండేళ్లకోసారి మాఘ మాసంలో నాలుగురోజులపాటు కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే సర్వ శుభాలూ కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
నాలుగు
మేడారం ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ దేవుళ్ల విగ్రహాలు ఉండవు.. కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ శాశ్వతమైన దేవతామూర్తులు లేకపోవడం విశేషం.. ఏటా సమ్మక్క సారలమ్మలను ఈ గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ తర్వాత వారిని వనప్రవేశం చేస్తారు.
ఐదు
ఆనాటి కాకతీయ రాజును ఎదిరించిన వన దేవతలుగా సమ్మక్క సారలమ్మలను గిరిజనులు కొలుస్తారు. అప్పటి ప్రతాప రుద్రుడు కప్పం కోసం సమ్మక్క భర్త పగిడిద్దరాజుపైకి యుద్దానికి వచ్చాడని.. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క ఆమె కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు మరణించారని చెబుతారు. తీవ్రంగా గాయపడిన సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్లి మాయమైందని చెబుతారు.