దేవాలయాల్లో ఈ పనులు అస్సలు చేయకండి.. చేస్తే దరిద్రమే..!

frame దేవాలయాల్లో ఈ పనులు అస్సలు చేయకండి.. చేస్తే దరిద్రమే..!

MOHAN BABU
 మన భారతదేశంలో దేవుడు అనే పదానికి చాలా విశిష్టత ఉంది. అలాగే మనం ఎక్కువగా నిష్టగా ఉండేది దేవుడి పేరు మీదనే. మన భారత దేశ సంస్కృతి లో గత ఏళ్ల సంవత్సరాల నుంచి దేవుళ్ళకు, దేవాలయాలకు ఘన చరిత్ర ఉంది. ఇప్పటికీ మనం అదే చరిత్ర ప్రకారం ఫాలో అవుతున్నాం. అంతటి మహిమ కలిగిన దేవాలయాల్లో మనం దర్శించుకునే టప్పుడు కొన్ని నిష్టగా పాటించేవి, పాటించనివి ఉంటాయి అవి ఏంటో తెలుసుకుందాం..?

 దేవాలయాలు ప్లాన్ ప్రకారం నిర్మించిన టువంటి  శక్తి క్షేత్రాలు ఈ దేవాలయాల్లో కొన్ని గుళ్ళు సిద్ధ పురుషులు, కొంత మంది రాజులు నిర్మించినవి మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో వారు వారి సంతానం కోసమో, వారి విజయానికి చిహ్నంగానో ఏదో ఒక విధంగా నిర్మించబడ్డ  క్షేత్రాలవి. ధ్వజస్తంభం, అలాగే గోపురం ఉన్నటువంటి దేవాలయాల్లో మనం తప్పకుండా కొన్ని విధులను పాటించాలి. మనం ఏదైనా శైవ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు వాహనంతో కానీ, చెప్పులతో కానీ లోపలికి అసలు వెళ్ళకూడదు. అలాగే ఆయుధాలు కూడా ధరించి వెళ్ళకూడదు. పూర్వం రాజులు కూడా ఆయుధాలు తీసి బయట పెట్టిన తర్వాతే దేవాలయాల్లోకి వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. అలాగే నోట్లో ఏదైనా నములుతూ దేవాలయంలోకి వెళ్ళకూడదు.

ఆ ప్రాంగణంలోకి వెళ్ళాక నమలడం పూర్తిగా తగ్గించాలి. అలాగే మలమూత్ర విసర్జన దేవాలయం ప్రాంగణంలో చుట్టుపక్కల కూడా అస్సలు చేయకూడదు. అలాగే దేవాలయాల్లో పరనింద, పరస్తుతి చేయకూడదు . అలాగే క్షేత్రాల్లో వివాదాలకు దిగకూడదు. అలాగే దేవాలయ ప్రాంగణంలో దేవుడికి తప్ప మరెవ్వరికీ కూడా నమస్కారం పెట్టకూడదు. మరో ముఖ్య విషయం ఏంటంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతనే దేవుడి దర్శనం చేసుకోవాలి. ప్రదక్షిణ చేసే శక్తి లేని వాళ్ళు కనీసం ఒక్క ప్రదక్షిణ అయినా చేయాలి. అలాగే జుట్టు విరబోసుకుని దేవాలయ దర్శనం చేసుకోకూడదు. తలపై ఏదైనా టోపీ కానీ లేదా ఏదైనా బట్ట కానీ వేసుకోని దర్శించు కోకూడదు . అలాగే మనం దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా కొద్దిసేపు ఆ గుళ్లో ప్రశాంతంగా కూర్చోవాలి. అలాగే కొన్ని  దేవాలయాల్లో దర్శన సమయంలో నిద్రించకూడదు. ఇలా కొన్ని నియమాలు పాటించి దేవాలయాల్లో దర్శనం చేసుకుంటే మీకు దర్శన భాగ్యం కలుగుతుందని చరిత్ర చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: