రుద్రాక్ష మొక్కలను ఇంటిలో పెంచుకోవచ్చా..?

Divya
రుద్రాక్షలకు మనం ఎన్నో పురాతన కాలం నుంచి వీటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో రుద్రాక్షకు ఎంతో విలువ కలదు. ఎందుకంటే రుద్రాక్షలంటే శివుడికి ఎంతో ప్రేమ కనుక వీటిని చాలా అలా జాగ్రత్త గా చూసుకుంటూ ఉంటారు ప్రజలు. ఇక అంతే కాకుండా వీటిని ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుందనే భావన కూడా ప్రజల లో ఉన్నది. అసలు ఇవి ఎలా వస్తాయి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

వీటిని మనం చూసే టువంటి పండితులు, అఘోరాలు, పూజారులు మిగతా వారు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. అయితే రుద్రాక్షి కేవలం పుట్టగానే అలా పుట్టదు.. ఇది కూడా ఒక కాయ లాంటిది. ఇవీ కూడా చెట్లకే కాస్తయట. ఇవి కూడా అ నీలిరంగులో ఉంటాయని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఇవి ఎక్కువగా హిమాలయాల్లోనే పండుతాయి. ఇది మన పరిసరాలలో పండించవచ్చు ని.. ఢిల్లీలోని కొంతమంది క్యాంపస్లో పండించినట్లు సమాచారం. అయితే ఇది కూడా కొన్ని ఏదైనా ప్రముఖ నర్సరీలలో అందుబాటులో ఉన్నట్లు గా ఆ యూనివర్సిటీ సంస్థ తెలియజేసింది. అంతే కాకుండా ఈ మొక్క ఒకటి ఉంటే చాలు వాటి నుంచి ఎన్నో రుద్రాక్షి మొక్కలను తయారు చేసుకోవచ్చు అని తెలియజేశారు.

ఢిల్లీలో ఉండే ఒక హార్టికల్చర్ ఫౌండర్ కు సంబంధించిన వ్యక్తి తెలియజేయడం జరిగింది. ఒక రుద్రాక్షి మొక్క బెరడు నుంచి కాస్త ఆ కొమ్మ పైన ఉండే చర్మాన్ని తీయడం వల్ల వాటికి మళ్లీ ఈ గురు వస్తుందని తెలియజేశారు. కేవలం ఆ మొక్కకు గాలి తగిలేలా ఉంటే చాలు అని తెలియజేశారు. ఇక అంతే కాకుండా వాటిని కొంచెం యాలకుల పొడి,తేనె వంటి పదార్థాన్ని ఆ చెట్టు కింద భాగం పోయడం వల్ల తొందరగా మొలక వస్తుంది అని తెలియజేశారు. అయితే వీటిని సామాన్యంగా ఇంటి దగ్గర ఎవరూ పెంచుకోరని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: