యునెస్కో : పశ్చిమబెంగాల్.. దుర్గాపూజకు గుర్తింపు..!

భారత సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అందుకే ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వచ్చి దేశంలో అనేక సంస్కృతీ, సాంప్రదాయాలను చూడటంతో తృప్తి లభించక, ఇక్కడే ఉంటూ వాటిని నేర్చుకుంటున్నారు. అంతటి విశిష్టత దేశ సంస్కృతికి ఉన్నది. అందులో కొన్ని ఆయా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తిస్తుండటం విశేషం. యోగ కూడా దేశ సంస్కృతిలో భాగమే, దానిని కూడా ఇప్పటికే గుర్తిచడం జరిగింది, ప్రపంచ యోగా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. మనిషి నిజమైన లక్ష్యం ఏమిటనేది కొందరి మదిలో మెదిలే ప్రశ్న. దానికి సమాధానం కోసం భారత్ వైపు చూసే వాళ్ళు ఎక్కువమందే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ విషయంపట్ల అవగాహన కల్పించే గురువులు లభిస్తారన్నది వాళ్ళ విశ్వాసం. అలాంటి జ్ఞానోపదేశం కోసం భారత్ ను సందర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్లలో కూడా కొందరు దేశంలోనే గురుసేవ చేసుకుంటూ ఉండిపోతున్నారు.
ఇలా ప్రపంచ నలుమూలలకు భారత సంస్కృతి, సాంప్రదాయాల ఖ్యాతి ఇప్పటికే వ్యాపించింది. దీనిని చూసి ఓర్వలేని వాళ్ళు దేశంపై ఎన్ని విషప్రచారాలు చేస్తున్నప్పటికీ, అవన్నీ ఏనుగు దారిన పోతుంటే కుక్కలా అరుపులా మిగిలిపోతున్నాయి. తాజాగా యునెస్కో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ని కలకత్తా లో నవరాత్రుల సందర్భంగా జరుపుకుంటున్న దుర్గా పూజను మానవత్వ సంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ గుర్తింపుతో బెంగాల్ ప్రజలలో కొత్త ఉత్సాహం వచ్చింది. బెంగాల్ లో ఎప్పటి నుండో నవరాత్రులను ఘనంగా జరుపుతారు. అక్కడ ఎక్కువ అమ్మవారిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. శక్తికి మారుపేరుగా అమ్మవారిని పూజిస్తారు. సృష్టిలో ప్రతి వారికి కావాల్సినవి అన్నీ అమ్మవారు ఇస్తుంది, అందుకు కృతజ్ఞతగా ఈ పూజలు చేస్తుంటారు.
యునెస్కో గుర్తింపు తో కలకత్తా దుర్గా పూజ ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఈ నెల 13-18 వరకు ఫ్రాన్స్ లో ని ప్యారిస్ లో జరుగుతున్న ఇంటర్ గవర్నమెంట్ కమిటీ కలకత్తా లో జరుపుతున్న దుర్గా పూజను యునెస్కో సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితాలో చేర్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఇది భారతీయులకు ఎంతో గర్వించదగిన విషయం అని, సంతోషించదగిన సందర్భం అని ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దుర్గా పూజ భారత ఉత్తమ సాంప్రదాయాలకు, జానపద కధలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. దుర్గా పూజ కలకత్తాలో విశేషంగా జరుపుతారు. 2003లోనే ఈ పూజను ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లో చేర్చడానికి యునెస్కో ప్రతిపాదించినప్పుడే అన్ని పార్టీలు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: