ఆర్ధిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేస్తే సరి..!

Divya
ప్రతి సంవత్సరంలో ఎన్నో నెలలు వస్తుంటాయి. కానీ కార్తీకమాసం కి చాలా విశేషం ఉన్నది. అయితే ఈ రోజున కొన్ని ఆర్ధిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే, కొన్నింటిని మనం పాటించవలసి ఉంటుంది. ఇక అంతే కాకుండా ఈ రోజున ఇలాంటి పూజ చేస్తే మంచి జరుగుతుందని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఈ రోజున ముఖ్యంగా త్రిపురాసురన్ అనే రాక్షసుడిని శివుడు చంపడం జరిగింది. అందుచేతనే ఈ రోజున త్రిపుర పౌర్ణమి పేరుతో పిలుస్తారు. అందు చేతనే ఈ రోజున దేవతలు గంగా నదిలో దిగి స్నానం చేయడానికి దిగుతారు. అందుచేతనే ప్రజలను కూడా ఏదైనా నదిలో స్నానం చేయాలని కొంతమంది సూచిస్తూ ఉంటారు. మన హిందూ శాస్త్రం ప్రకారం ఈ రోజున శివాలయంలో పూజ చేస్తే ఆర్థిక సమస్యలు కనుమరుగవుతాయని శాస్త్రంలో తెలియజేయడం జరిగింది.
ఈ రోజున పూజ చేయాలనుకునేవారు నాలుగు బిల్వ పత్రి ఆకులు, తెల్ల చందనం, ఎర్ర బియ్యం, దానిమ్మ చెట్టు వేరు, తేనె, కుంకుమ, వంటివి తీసుకొని ఏదైనా నదిలోకి వదిలి 11 రోజులు స్నానం చేయాలి. ఇలా ఎంతో నిష్టతో చేయడం వల్ల తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు పౌర్ణమి కావున ఇంట్లో వాళ్లతో గొడవ పడకుండా ఉండేందుకు వెండి గ్లాసులో ఇంటిల్లిపాదికి పాలను ఇస్తే ఇళ్లు సుఖశాంతులతో ఉంటుంది.
ఎవరైనా  ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని దుర్గామాత పాదాల దగ్గర ఉంచడం వల్ల వారికి అదృష్టం కలుగుతుంది.
ఈ రోజున నది వద్ద ఎవరికైనా పాలు దానం చేయడం వల్ల, మంచి కలుగుతుందట. ముఖ్యంగా వారికి అజ్ఞాత లు చెప్పడం మర్చిపోకండి.
ఈ రోజున తులసి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించడం చాలా మంచిదట. వీటితో పాటు ఈ రోజు తులసి మొక్కను కూడా దానం చేస్తే మంచిదని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: