ఈ మాసం లో వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా..?
ఈ నెలలో ఈ రోజున ఉపవాసం ఉండీ, దేవుడిని పూజించినట్లయితే అన్ని శుభాలు జరుగుతాయట. ముఖ్యంగా పూజ అయిపోయిన వెంటనే దాన ధర్మాలు చేస్తే పాపాల నుండి విముక్తి కలుగుతుందట. ఈ నెలలో ప్రజలంతా కేవలం ఒకరోజు కోసమే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.ఆ రోజు ఏమిటంటే వనభోజనాల రోజు. అయితే ఈ కార్తీక మాస నెలలు ఎందుకు వనభోజనాలు చేస్తారని విషయం ఇప్పుడు చూద్దాం.
ఉసిరి చెట్టు కు క్షమాగుణాన్ని కలిగి ఉండడం వల్ల, అందుచేత ఎక్కువగా వనభోజనాల రోజున ఆ చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. అంతే కాకుండా ఉసిరి చెట్టు లక్ష్మీ దేవత స్వరూపం. ఆ చెట్టు ఎక్కడ ఉన్నచో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఇక సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటాడు అన్నట్లు శాస్త్రం తెలుపుతోంది. అందుచేతనే ఈ చెట్టు కింద అందరూ భోజనం చేయాలని కుతూహలంగా ఉంటారు.
భోజనాలను మనం ఎక్కువగా ఎక్కడి నుంచైనా తెచ్చుకొని తింటూ ఉంటాము, తెచ్చుకొని మనం వనభోజనాలు రోజున తినకూడదట. కేవలం చెట్టు కింద వండుకొని మాత్రమే తినాలి, లేదంటే ఏదైనా ఆలయాల్లో భోజనం పెడితే తినాలట. ఇక అలా కాకుండా ఎలా తిన్నప్పటికీ అది ఆసాక్షి భోజనం అవుతుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. మనలో కొంత మంది భోజనం చేసేటప్పుడు తిరుగుతూ తింటారు. మరి కొంతమంది అయితే మంచం, మీద కూర్చొని తింటూ ఉంటారు. ఇలా భోజనం చేయడం వల్ల ఆ వ్యక్తి లోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు అన్నట్లుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉసిరి చెట్టు గాలి వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలట.