దీపావళి పండుగ..ఎలా ఆవిర్భవించిందో తెలుసా..?

Divya
దీపావళి అంటే కేవలం దీపాల అలంకరణ టపాసులు కాల్చడం వంటివే కాదు. అసలు దీపావళి ఎలా వచ్చింది. ఎందుకు జరుపుకుంటారు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఈ పండుగ వెనుక అసలు ఎంత ఉంది కథ ఉన్నదో తెలుసా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నరకాసురుడనే రాక్షసుడిని అంతం చేయడం వల్ల మరుసటి దినమున అతడి పీడ విరగడయింది ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటున్నారని కొంతమంది పురాతన పండితులు తెలియజేశారు. ఈ పండుగను కుల మతంగా బేధాలు లేకుండా చేసిన ఈ పండుగను చేసుకుంటారు. చెడు నుంచి మంచి గెలిచింది కాబట్టి ఇ పండుగను విజయానికి సంకేతంగా చేసుకుంటాం అన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య దినమున వస్తుందట. దీపావళి రోజున లక్ష్మీపూజ ను పూజిస్తారు. ఆ వెలిగించిన జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావించడం జరుగుతుంది.ఇ దీపాలంకరణ  ఇంటిల్లిపాది ఆనందానికి, నవ్వులకు సిరిసంపదలకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ దీపాలను ఏదైనా నదులలో వదలడం వల్ల వారికి చాలా మంచి జరుగుతుందట. ఈ రోజున మహాలక్ష్మీ పూజ జరుపుకుంటారు. అందుకు కూడా ఒక ఒక కారణం ఉన్నది వాటి గురించి చూద్దాం.


దుర్వాస మహర్షి ఒక రోజున వెళ్లి దేవేంద్రుడికి ఒక హారాన్ని బహుమతిగా ఇస్తాడు. కానీ ఇంద్రుడు మాత్రం హారాన్ని తిరస్కరిస్తాడు. ఇక తన నా దగ్గర ఉన్న ఐరావతాన్ని ఇంద్రుడు మెడలో కి వేసుకుంటాడు. ఆ తరువాత హారాన్ని ఆ ఐరావతం తొక్కేస్తుంది. ఇదంతా చూసిన దుర్వాసమహర్షి తన కోపంతో దేవేంద్రుడిని శపిస్తాడు. ఇక దేవేంద్రుడు తన అష్టైశ్వర్యాలను కోల్పోయి దీనస్థితిలో ఉన్నప్పుడు మహావిష్ణువును అర్థిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ విష్ణువు దేవేంద్రుని దగ్గరకు వచ్చి ఒక దీపాన్ని వెలిగించి.. దానిని మహాలక్ష్మిగా అ పూజించు అని తెలియజేస్తాడు. అలా లక్ష్మీదేవి తన సంపదలను తిరిగి ఇస్తుంది.
అందుకనే ఈ రోజున మహాలక్ష్మి పూజ చేసుకుంటారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: