రామమందిరం కోసం .. పవిత్ర జలాల సేకరణ సిద్ధం ..

బీజేపీ దేశంలో అధికారంలోకి రాగానే దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన రామమందిరం సమస్యను కొలిక్కి తెచ్చింది. అంతే కాదు ఆ స్థలంలో మందిర నిర్మాణానికి ఇప్పటికే సరికొత్త డిజైన్ విడుదల చేసింది. దానిని వీలైనంత త్వరగా సిద్దము చేసేందుకు ఏర్పాట్లు చకచకా చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే ఎప్పటి నుండో రామమందిరం కోసం ఎందరో భక్తులు ఇచ్చిన అనేక వనరులు మందిర నిర్మాణానికి సిద్దంగానే ఉన్నాయి. మందిర నిర్మాణానికి ముహూర్త సమయం తదితర విషయాలు ఇప్పటికే నిర్ణయించబడ్డాయి. ఆయా నిర్ణయాల మేరకు మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందరో శిల్పులు దీని కోసం అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నారు.
మందిరం నిర్మాణం పూర్తి అయ్యేవరకు ఆ నిర్మాణ స్థలంలో తాత్కాలికంగా ఎప్పటి నుండో ఉన్న రామ విగ్రహాలకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. అక్కసారి ఆలయ నిర్మాణం పూర్తి కాగానే ఈ విగ్రహాలను పునః ప్రతిష్ట చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏడు ఖండాలలోని 192 దేశాల లో ఆయా జలాశయాల నుండి పవిత్ర జలాలను తీసుకు వచ్చారు. దేశరాజధాని ఢిల్లీకి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ జాలీ ఆధ్వర్యంలో ఈ సేకరణ జరుగుతుంది. ఇటీవలే ప్రపంచం లోని 115 దేశాల లోని నదులు, సముద్రాల నుండి సేకరించిన పవిత్రజలాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తన నివాసంలో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్ డెన్మార్క్, ఫిజి, నైజీరియా వంటి పలు దేశాల రాయబారులు, హైకమిషనర్లు ఉన్నారు.
ఈ పవిత్ర జలాలను ఆలయ శుద్ధి కోసం, రామాభిషేకానికి వినియోగించనున్నారు. మిగిలిన దేశాల నుండి కూడా పవిత్ర జలాల సేకరణ జరుగుతుందని రాజ్ నాధ్ సింగ్ చెప్పారు. మందిర నిర్మాణం పూర్తి అయ్యేలోపు ఆ సేకరణ కూడా చేస్తారని ఆయన తెలిపారు.బాబ్రీ మసీదు-రామమందిరం వివాదం ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్నా ఒక కొలిక్కి రాలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ సమస్య త్వరిత గతిన ఒక పరిష్కారం ఇరువురి కి ఆమోదయోగ్యం కావడంతో మందిర నిర్మాణం తిరిగి చేపడుతున్నారు. అలాగే కోర్ట్ ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు కు ఆయా మతస్తులకు స్థలం కేటాయించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: