వినాయకుని 16 రూపాల గురించి తెలుసా ?

VAMSI
యాగమైనా, యజ్ఞమైనా, వ్రతమైనా, పూజ అయినా కుల దైవం ఎవరైనా, ఇష్ట దైవం ఎవరైనా తొలి ప్రార్దన మాత్రం గణాధిపతి వినాయకుడికి అందాల్సిందే. ఎటువంటి శుభకార్యం తలపెట్టినా సరే ముందుగా హిందువులు విగ్నేశ్వరుని పూజించి ఆ తరవాత మిగతా దేవుళ్ళకు పూజలు చేస్తారు. ఆ తర్వాతనే కార్యక్రమం మొదలుపెడతారు. ఇది మన ఆచారం. పురాణాల్లో చెప్పబడిన శాస్త్రం. శివ, పార్వతులు ప్రీతి పుత్రుడు సకల దేవతాగణములకు అధిపతిగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా అక్కడ వినాయకుని ప్రతిమ లేదా చిత్ర పటం తప్పక ఉండాల్సిందే. అదే విధంగా తొలి పూజ విఘ్నేశ్వరునికి చేయాల్సిందే.
ఎందుకంటే మనం తలపెట్టిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరగాలంటే  విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని చల్లని చూపు మనపై ఉండాల్సిందే. అందుకే ఆయనకు మనం తొలి పూజ చేస్తాము.  ఈ రోజు అందరూ వినాయకుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆయన కోసం రకరకాల పిండి వంటలు తయారుచేసి ఆయనకు నైవేద్యంగా పెడతారు. వినాయకునికి ఇష్టమయిన ఉండ్రాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తారు.
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతయే"
అన్న శ్లోకాన్ని పటించి గణనాయకుడిని పూజించాలి. మొత్తం పదహారు రూపాలలో వినాయకుడిని పూజిస్తుంటారు. ఆయన ఈ పదహారు అవతారాలలో దర్శనమిచ్చారని మన పురాణాల్లో చెప్పబడింది. ఇపుడు ఆ పదహారు రూపాలు ఏవో తెలుసుకుందాం.
1. బాలగణపతి
2. ధ్వజ గణపతి
3. భక్త గణపతి
4. పింగళ గణపతి
5. తరుణ గణపతి
6. శక్తి గణపతి
7. వీర గణపతి
8. లక్ష్మీగణపతి
9. విఘ్న గణపతి
10. భువనేశ గణపతి
11. నృత్త గణపతి
12. ఉచ్ఛిష్ట గణపతి
13. ఊర్ధ్వగణపతి
14.  క్షిప్ర గణపతి
15. హేరంబ గణపతి
16. మహాగణపతి
మరి ఈ రోజు మీ ఇంటిలో ఏ రూపాన్ని పూజిస్తున్నారు. ఈ రోజు వినాయకచవితి సందర్భంగా మీ ఇంట్లో అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఏపీహెరాల్డ్ కోరుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: