వినాయక చవితి : తప్పకుండా చేయాల్సిన, అస్సలు చేయకూడని పనులు ఇవే !

Vimalatha
సెప్టెంబర్ 10న వినాయక చవితి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. భాద్రపద శుక్ల పక్ష చతుర్థి నాడు గణేష్ ని పూజిస్తారు. పదకొండు రోజుల పాటు జరిగే గణేశోత్సవం ఈ రోజున ప్రారంభమవుతుంది.
ఈ విషయాలను తప్పనిసరిగా శ్రీ గణేష్ కు సమర్పించాలి,
గణపతి గొప్ప మేధో జ్ఞానం ఉన్న దేవుడు. ఆయనను పూజిస్తే మేధో వికాసం అవుతుందని నమ్ముతారు హిందువులు. అందుకే భక్తులు ఆయన దీవెనలు పొందడానికి హృదయపూర్వకంగా, భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. భక్తులు గణపతిని పూజించేటప్పుడు చిన్న చిన్న విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడంలో తద్వారా ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలని. కానీ కొంతమంది తెలీకపోవడం వల్ల వారు వినాయకుడికి ఈ కొన్ని వస్తువులను అందించడం మర్చిపోతారు. మొదటిది మోదకం, రెండవది దుర్వా (ఒక రకం గడ్డి), మూడవది నెయ్యి. ఈ మూడూ గణపతికి చాలా ప్రియమైనవి. అందుకే ఎవరైతే గణపతి పూజలో ఈ విషయాలను ఖచ్చితంగా, భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారో వారు వినాయకుని ఆశీర్వాదాలను పొందుతాడు.
మేము ప్రసాదంలో గణపతికి మోదక్ ఎందుకు అందిస్తాము?
గణపతి ఆరాధనలో రిద్ధి, సిద్ధి దేవుడు. ముఖ్యంగా ఆయనకు మోదకాన్ని ప్రసాదంగా అందిస్తారు. మోదక్ గణపతికి చాలా ఇష్టమని అంటారు. కానీ దీని వెనుక పౌరాణిక విశ్వాసాలు దాగి ఉన్నాయి. పురాణాల ప్రకారం గణపతి, పరశురాముల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో గణపతి దంతాలలో ఒకటి విరిగింది. ఈ కారణంగా ఆయన తినడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. ఆయన బాధను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి కొన్ని వంటకాలు తయారు చేశారట. ఎందుకంటే ఇవి తినడానికి సులువుగా ఉంటాయి, పైగా దంతాలలో నొప్పిని కలిగించవు కదా. ఆ వంటలలో మోదక్ ఒకటి. మోదక్ తినడానికి చాలా మృదువుగా ఉంటుంది. శ్రీ వినాయకుడికి మోదక్ అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. అందువల్ల భక్తులు వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి మోదకాన్ని ప్రసాదంగా సమర్పించడం ప్రారంభించారు.  
గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడొద్దు అంటే ?
గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడొద్దని నమ్ముతారు. చూస్తే ఆ వ్యక్తి తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి రోజున చంద్రుడి చూశాడు,. దాని కారణంగా ఆయన కూడా అసత్యానికి బలి కావాల్సి వచ్చింది. గణేష్ చతుర్థి రోజున చంద్రుడిని చూడటం గురించి మరొక పౌరాణిక నమ్మకం ఉంది. దీని ప్రకారం వినాయకుడు ఈ చతుర్థి నాడు చంద్రుడిని శపించాడు. ఈ కారణంగా చతుర్థి నాడు చంద్రుడిని చూడకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: