గణపతి బప్పా మోరియా.. అని ఎందుకు అంటారు అంటే..?

Divya
వినాయక చవితి పండగ ని దేశమంతటా చేసుకుంటూ ఉన్నారు. ఇక భక్తిశ్రద్ధలతో గణనాథుడిని స్మరించడానికి కి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఇక గణపతి బప్పా మోరియా.. అనే సమయం వచ్చింది. అయితే గణపతి బప్పా మోరియా.. అనే పదం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
మోరియా అని ఎందుకు అంటారు అంటే.. పూర్వం గండకిని పరిపాలించిన రాక్షసి రాజు.. సింధురాసుడు.. ఈయన దాదాపుగా 200 ఏళ్ల నుంచి తపస్సుచేసి సూర్యుడి నుండి వెలువడిన అమృతాన్ని పొందాడు. ఆ అమృతం అతని పొట్ట లో ఉన్నంత కాలం అతనికి చావు భయం ఉండదు. ఆ ధైర్యంతోనే ఈ రాక్షసుడు తన పరాక్రమాలతో ముల్లోకాలను జయించాలని చూస్తాడు.

ముందుగా దేవతలను జయించి ఆ తరువాత వారందరినీ కారాగారంలో బంధించాలి అని అనుకుంటాడు. ఇక ఆ తరువాత కైలాసం, వైకుంఠ పాలెం ఇలా అన్నింటినీ ఆక్రమణ చేసుకోవాలని చూస్తాడు.. ఈ సింధురాసుడు. ఇక ఏకంగా శ్రీమహావిష్ణువుని తనకి అండగా ఉండమని ఆజ్ఞాపించాడు. ఇక అప్పుడు ఈ దేవతలు అందరూ కలిసి వినాయకుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు.
అలా ఆయన శరణు వేడుకుంటూ ఉండగా వారి ప్రార్థనలను మన్నించాడు గణపతి దేవుడు..ఇక  పార్వతి దేవుడు కుమారుడు కనుక కచ్చితంగా సింధూరాసురుని చంపేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకునేందుకు పార్వతి దేవి కొడుకుగా జన్మించాడు అని అక్కడుండే దేవతలు కొంతమంది తెలియజేశారు. ఇక కొద్ది సంవత్సరాల తర్వాత సింధురాసునికి మిత్రుడు.. కమలా సురుడు శివుని పై యుద్ధానికి బయలుదేరాడు.. అప్పుడు గణపతి నెమలి వాహనం మీద వెళ్లి ఘోరమైన యుద్ధం చేశాడు.

అలా కమలాసురిని వధించడం జరిగింది. కమలాసూరుడి తల వెళ్లి మోర్గం లో పడింది.ఆ తర్వాత సింధురాసుని దగ్గరకు వెళ్లి మూడు రోజులపాటు గణపతి యుద్ధం చేశాడు. చివరికి సింధురాసుడు ఖడ్గం చేత పట్టి గణపతి వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు గణపతి నెమలి వాహనం మీద నుంచి దిగి, చిన్న బాణం తీసుకుని.. సింధూరసురుని.. పొట్టపై బాణం వదిలాడు. దాంతో అమృతం అంతా బయటికి వచ్చి సింధు రాసుడు మరణించడం జరిగింది.
అప్పుడు మోర్గం క్షేత్రంలో గణపతి దేవాలయాలు నిర్మించి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అందుచేత మరాఠీ భాషలో మోర్ అంటే నెమలి కాబట్టి ఆ ప్రదేశంలో నెమలి ఎక్కువగా తిరగడం చేత ఆ గ్రామానికి కూడా మోర్గాన్ అని పేరు వచ్చింది . అక్కడ గణపతిని మోరేశ్వర్  అని అంటారు. అలా భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ పిలవడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: