వినాయక చవితి వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసా..?
వినాయక మండపంలో ఎవరి శక్తి కి తగ్గట్టుగా వారు విఘ్నేశ్వరుని విగ్రహాలను ప్రతిష్టిస్తారు. రాతి వినాయకుని పూజిస్తే జ్ఞానం, రాగి లంబోదరుడి ప్రతిమను పూజిస్తే ఐశ్వర్యం, వెండి వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే ఆయుష్షు, బంగారు బొజ్జగణపయ్యను పూజిస్తే సంకల్పసిద్ధి లభిస్తాయని, కానీ మట్టితో చేసిన వినాయకుని ప్రతిమను పూజిస్తే సర్వమూ లభిస్తాయని గణేశ పురాణం ఉంది.
పూర్వం నుంచి వినాయక చతుర్థి ప్వదినాన మండపంలో మట్టి విఘ్నేశ్రుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. తర్వాత ప్రజలు విశ్వాసాన్ని ఆధారంగా కొంతమంది మూడు రోజులు, 9 లేదా 12 రోజులు ఉత్సవాలను నిర్వహించిన అనంతరం వినాయక ప్రతిమను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేసే సంప్రదాయం కొనసాఉతోంది. ఇలా చేయడం వల్ల మట్టి నుంచి వచ్చిన మనిషి మట్టిలోనే కలిసిపోతాడని పెద్దల నమ్మకం.
ఏ పూజలోనైనా ముందుగా గౌరీ తనయుడిని పసుపుతో చేసి పూజిస్తారు. పసుపుతో చేసిన గణపతిని పూజించడానికి గల కారణం పసుపును యాంటిబయాటిగా వాడుతారు. భారతీయుల ఔషధాల్లో పసుపునకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులకు తెలిసిన మొదటి ఔషధం పసుపే అయి ఉంటుంది. అందుకనే వైద్యంలో, ఆహారంలో ఉపయోగించే పసపును వినాయకుడి రూపంలో ఆరాధిస్తారు.
వినాయక చతుర్థి రోజున భగవంతున్ని 21 పత్రాలతో పూజిస్థారు. ఈ కాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పుట్టిన వ్యాధులు సాధారణంగా వ్యాపిస్తాయి. చవితి తరువాత వినాయక ప్రతిమతో పాటు పూజించిన ఆ ఆకులను కూడా నిమర్జనం చేస్తారు. ఈ ఆకులు నీళ్లలో కలవడం ద్వారా ఆ నీళ్లు శుద్ధి అవుతుందని పెద్దలు విశ్వసిస్తారు.
ఆయుర్వేదంలో ఆవిరి వండిన ఆహారం సహజ నివారణ లక్షణాలను కలిగి ఉండడం వల్లనే కావొచ్చు గణేష్ చతుర్థి రోజున చేసుకునే పిండి వంటలయిన కుడుములు, ఉండ్రాళ్లు ఆవిరితో తయారు చేస్తారు. ఈ విధానంలో చేసిన వంటకాలు తినడం ద్వారా త్వరగా జీర్ణం అవుతుంది. బియ్యపురవ్వ, బెల్లంతో చేసే పదార్థాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని అందజేస్తాయి.
గణేష్ చతుర్థి రోజున వినాయకుడిని పూజించకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయని పెద్దలు నమ్ముతారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే వినాయ చవితి రోజు సూర్యుడు భూమికి దూరంగా తులా రాశిలో ఉంటాడు కాబట్టి ఆ రోజు చంద్రుడి మీద సూర్యుని కిరణాలు అంత చురుకుగా పడవు. దీని వల్ల ఆరోజు చంద్రుడిని చూస్తే మానవుని మనసు మరింత వ్యాకులతతకోనూ, బుద్ది మందగమనంగానూ ఉంటుందని చెబుతారు.