శ్రావణ వేళ : ఈ రోజు ఏ సమయంలో పూజను ఆచరించాలి ..!

Divya
శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ముందు, రాబోయే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రత పూజను సౌభాగ్యవతులు చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఈ రోజును చాలామంది సౌభాగ్యవతి లు ఎంతో పవిత్రంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే పూజ ఏ సమయంలో ఆచరించాలి.. ఎప్పుడు నోము నోచుకుంటే వరలక్ష్మీ మాత ప్రసన్నం అవుతుంది.. అనే విషయాలు తెలియక క్యాలెండర్లను కూడా అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటారు. ఈ రోజు ఏ సమయంలో పూజ చేస్తే అమ్మవారు మరింత ప్రసన్నం అవుతారు అనే పూర్తి విశేషాలను, పంచాంగము ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రావణమాసము  ప్లవ నామ సంవత్సరం .. దక్షిణాయనం..
సూర్యోదయం ఉదయం 5 గంటల 46 నిమిషాలకు..
సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు..
తిథి .. త్రయోదశి రాత్రి .8.04 వరకు
వారము - శుక్రవారం
నక్షత్రం - ఉత్తరాషాడ రాత్రి 9 గంటల 56 నిమిషాల కు..
శుభ ఘడియలు - ఉదయం తొమ్మిది గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల వరకు..
తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు.
రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు.
యమగండకాలం - పగలు 3:00 నుండి 4:30 నిమిషాల వరకు.
దుర్ముహూర్తం - ఉదయం 8:24 నుండి 9:12 నిమిషాల వరకు.
తిరిగి 12:24 నిమిషాల నుండి 1: 12 వరకు..
వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో చేయాలి అంటే, కలశస్థాపన ఏ సమయంలో చేయాలి అంటే.. అమ్మవారికి సింహ లగ్న పూజ అంటే చాలా ఇష్టం. అయితే ఎవరైతే ఈ సింహ లగ్న సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి పూజ మొదలు పెడతారో, వారికి ఆయురారోగ్యాలు , నిండు నూరేళ్లు సంతానంతో సౌభాగ్యవతి జీవిస్తారు అనేది నమ్మకం.
అయితే ఏ సమయంలో సింహలగ్నం పూజ చేయాలి అంటే సింహలగ్నం ఉదయం 5:53 నుండి ఉదయం 7:59 నిమిషాల వరకు.
ఇక ఇంత ఉదయాన్నే పూజ చేయలేము అని అనుకునే వాళ్ళు దుర్ముహూర్త గడియలు  దాటిన తర్వాత అంటే ఉదయం  9:12 దాటిన తర్వాత అలాగే 10:30 లోపు  అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో పూజ చేయడంవల్ల లక్ష్మీదేవి అత్యంత ప్రసన్నురాలు  అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: