పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం భక్త జనాలు ప్రపంచనలుమూలల నుండి లక్షల్లో వస్తుంటారు. వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలికే ప్రత్యక్షదైవం అని, కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే పురుషోత్తముడని విశ్వసిస్తూ భక్తులు వారి కోరికలను ఆ ఏడుకొండలస్వామికి మొర పెట్టుకోవడానికి కదలి వస్తారు. తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం అని ప్రతీతి అందుకే ఈ వైకుంఠంలో అడుగు పెట్టి పుణ్యాన్ని మూట కట్టుకోవాలని భక్తులు తరలి వస్తారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రతిరోజు లక్షకు పైగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల సంఖ్య ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపు 5 లక్షలకు పైగానే భక్తజనం తిరుమలకు తరలివస్తారు.
సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరునిగా తిరుమల కొండపై స్వయంభువుగా అవతరించారని భవిష్యత్ పురాణంలోని శ్రీ వేంకటాచల మహత్యంలో చెప్పబడింది. మన కోరికలో న్యాయం ఉండి ఆ విషయం తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుంటే ఖచ్చితంగా జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలోనే ఉండి ఆయన సేవ చేసుకునే అవకాశం కల్పిస్తే, ఇనెక్ముంది భక్తుల అమందనికినబదులు ఉండవు. ఈ సేవ చేసుకునేందుకు అవకాశం అందరికీ సాధ్యం కాదని, ఎంతో పుణ్య ఫలం ఉంటే తప్ప ఈ అవకాశం దొరకదు అంటుంటారు. ఇక శ్రీనివాసుని సన్నిధిలోనే ఉండి ఆయన సేవలో పాలుపంచుకునే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు.
శ్రీవారి సేవ కోసం తరిస్తున్న భక్తులు టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ పాలుపంచుకొని సేవ చేసుకుంటారు. ఇలా సేవకు వచ్చిన వారికి అక్కడ బస చేసే వసతి, భోజనం, చివరి రోజు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ ఏడుకొండల స్వామికి సేవ చెసే అవకాశం వస్తే జన్మ దన్యమైనట్లే. అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇలా ఆ వేంకటేశుని సమక్షంలో సేవ చేయడం ద్వారా మీ సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రతీతి.