ఈ రోజుల్లో కటింగ్ చేసుకుంటున్నారా ఇవి తెలుసుకోండి ?

VAMSI
మాములుగా కొన్ని పనులను చేయకూడని సమయంలో లేదా చేయకూడని రోజుల్లో చేస్తే కనుక అరిష్టం పట్టుకుంటుందని శాస్త్రాలలో ఉంది. ముఖ్యంగా తల వెంట్రుకలు కట్ చేయడం పనిని అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. గతంలో పెద్దవాళ్ళు చెప్పిన విధంగా రాహు కాలం మరియు మంచి శకునాలు చూసి ఇలాంటివి చేస్తుంటారు. ఒకవేళ అలా చేస్తే కనుక చెడు జరుగుతుందని బలంగా నమ్మేవారట. అయితే ఏ సమయం మరియు రోజులో చేస్తే ఏమి జరుగుతుందో చూద్దాం. శాస్త్రజ్ఞుల సూచనల ప్రకారం వెంట్రుకలను కట్ చేయాలి అనుకుంటే, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే పూర్తి చెయ్యాలి. అంతే కానీ ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వేళ కానీ, లేదా చీకటి పడ్డాక కటింగ్ చేయడం మానేయాలి. అప్పుడే మీకు శుభం జరుగుతుంది. ఇందులో ఇంకో రూల్ కూడా ఉంది.
ఒకే ఇంటిలో ఉన్న అన్నతమ్ములు కానీ లేదా తండ్రి కొడుకులు కానీ కటింగ్ చేసుకోవడం అశుభానికి దారి తీస్తుందని నమ్ముతున్నారు. కానీ సోమవారం మీరు కటింగ్ చేసుకుంటే మీకు ఆయుస్సు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా సంపద వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. అయితే ఒకే కొడుకు ఉండేవారు మాత్రం కటింగ్ చేసుకోవద్దు. మంగళవారం మీరు గమనిస్తే కటింగ్ షాపులన్నీ మూసేస్తారు. ఒకవేళ ఎవరైనా మంగళవారం కటింగ్ చేసుకుంటే మీ ఆయుస్సు ఎనిమిది నెలలు తగ్గిపోతుంది.  ఇకపోతే బుధవారం కటింగ్ చేసుకుంటే 5 నెలలు ఆయుస్సు పెరుగుతుందట, మరియు ఆరోగ్యంగా ఉంటారు.
గురువారం రోజున కటింగ్ చేసుకుంటే, వారికి పది నెలల ఆయుస్సు తగ్గిపోతుందట. ఈ రోజున కటింగ్ చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇక శుక్రవారం నాడు కటింగ్ చేసుకుంటే, 11 నెలల ఆయుస్సు  తగ్గిపోతుంది. శనివారం రోజు కూడా కటింగ్ చేసుకోకూడదు...ఇలా చేస్తే మీరు అనారోగ్యం పాలవుతారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.  ఇక ఆదివారం అందరికీ సెలవు దినం. కాబట్టి అందరూ ఈరోజునే ఎక్కువగా కటింగ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజు ఇలా చేయడం వలన ఒక నెల ఆయుస్సు తగ్గుతుంది. ఇలా మీరు పై విషయాలను పాటించి ఎప్పుడు కటింగ్ చేసుకోవాలో తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: