సత్యనారాయణస్వామి వ్రతం విశిష్టత...?

VAMSI
హిందువులు తమ జీవితంలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్లనే మన సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. జీవితం బాగుండాలని ప్రజలు ఎన్నో రకాల వ్రతాలు, నోములు, పూజలు చేస్తుంటారు.. అలాంటి వాటిలో ఒకటైన సత్యనారాయణ వ్రతం గురించి నేడు తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లయిన నూతన వధూవరులు జరుపుకుంటారు. అయితే ఈ వ్రతం ఎందుకు జరుపుకుంటారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.. అయితే ఇప్పుడు ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.
సత్యనారాయణ వ్రతం, అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజ. ఈ వ్రతాన్ని హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరిస్తే వారి కాపురం మూడు పువ్వులు ఆరుకాయలుగా వెలిగిపోతోందని ఒక విశ్వాసం. సర్వదేవతల అనుగ్రహం ఈ వ్రతం చేత ఆ నూతన వధూవరులకు అందుతుందని ఒక నమ్మకం. ఈ సత్యనారాయణ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలను కష్టాలను నష్టాలను... ఈ వ్రతం ద్వారా వచ్చే పుణ్యం వలన రూపుమాపవచ్చని ఒక విశ్వాసం. అత్త వారింటికి కొత్తగా అడుగుపెట్టిన కోడలు తన భర్తతో కలిసి ఈ వ్రతం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వ్రతం ద్వారా ఆ పెళ్లయిన కొత్త జంటకు ఆరోగ్యం, ఆనందం, ఆయుష్షు లభిస్తాయి.
అంతేకాకుండా ఈ వ్రతం కొత్తగా తమ ఇంట అడుగుపెట్టిన కోడలిని అందరికీ పరిచయం చేస్తారు అత్తింటివారు. సత్యనారాయణ వ్రతం చేయడం వలన నూతన వధూవరుల భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని మన పురాణాలు చెబతున్నాయి. ప్రధానంగా ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లయిన జంట ద్వారా చేయిస్తారు.... కానీ ఈ వ్రతాన్ని విద్యార్థులు, వ్యాపారులు ఇంక ఎవరు భక్తి శ్రద్ధలతో ఆచరించిననూ సమస్యలు తొలగి విజయం పొందగలరని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: