ఉగాది రోజున చేయవలసిన పనులివే...?

VAMSI
ఉగాది...తెలుగువారికి ముఖ్యమైన పండుగ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే విషయం ఉగాది పచ్చడి. షడ్ రుచుల కలయికతో తయారు చేసే ఈ పచ్చడి మానవుల జీవన శైలి ఎలా ఉండాలన్న విషయాన్ని సూచిస్తుంది. ఆరు రకాల వంట పదార్ధాలతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వొగరు, చేదు వంటి ఆరు రకాల పద్దార్థాలను కలిపి తయారు చేస్తారు. ఈ ఆరు రకాల రుచులు లాగే జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతాయి అన్నింటినీ ఎదుర్కొని..ఆనందంగా స్వీకరించి ముందుకు సాగాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుందని దీని వెనుకున్న అర్ధం. ఉగాది నుండి మన తెలుగు వారి సంవత్సరం మొదలవుతుంది.
కాబట్టి ఇది తెలుగు వారికి మొదట వచ్చే పండుగ. ఎంతో విశిష్టమైనది కూడా, ఉగాది ప్రాముఖ్యం చైత్ర, శుద్ధ, పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం మొదలు పెట్టారన్నది  శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13 న ఉగాది పండుగ వచ్చింది. ఈ కాలంలో అన్ని చెట్లు చిగుర్లతో నూతన అందంతో ఎటు చూసిన ఎంతో పచ్చగా కనిపిస్తూ వెలిగి పోతుంటాయి. అయితే ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి..ఉగాది పండుగ నాడు తెల్లవారు జామునే లేచి  నువ్వుల నూనెను తలకు పట్టించి, సున్నిపిండితో నలుగు పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. ఉగాది పండుగను తెలుగువారి నూతన సవంత్సరంగా భావిస్తాం కనుక తప్పకుండా  కొత్త బట్టలను ధరించాలి.
అంతేకాకుండా ఉగాది రోజు ప్రత్యేకించి నియమ నిబంధనల నడుమ పూజను ప్రారంభించాలి. ఉగాది పచ్చడి తప్పక తయారు చేసి మన బంధు మిత్రులకు ప్రేమగా పంచాలి. ఉగాది పర్వదినం నాడు పది మందికి భోజనం పెట్టి ఎంతో పుణ్యం వచ్చేలా చేసుకోవాలి. మీ జీవితంలో ప్రతి ఉగాది ఆచరిస్తే మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా అందంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: