ఆధ్యాత్మికం: పూజ చేసే పద్దతి ఇదే..?

VAMSI
హిందువులు తమ తమ ఇష్ట దైవాలకు నిత్యం పూజలు చేస్తుంటారు. తమ కోర్కెలు నెర వేర్చమని, వారి జీవితాలు సాఫీగా సాగేందుకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటారు. అయితే ఒక్కక్కరు ఒక్కో పూజా విధానాన్ని అనుసరిస్తుంటారు. కొందరు పొద్దున పూట మరికొందరు సంద్యా సమయాన దేవుడికి పూజ చేస్తుంటారు. పూజా చేసే సమయంలో వివిధ పుష్పాలను దేవుళ్ళ ప్రతిమలకు అలంకరించి, పసుపు కుంకుమలు సమర్పించి, దీపారాధన చేస్తుంటారు. కొందరైతే ప్రత్యేకించి ప్రతి రోజు నైవేద్యాన్ని చేసి దేవుడి కి సమర్పిస్తుంటారు. కానీ ఆ దేవుడి చల్లని అనుగ్రహం కోసం వీటన్నిటికంటే ముందు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి.
పూజా సమయంలో మన మనస్సు దేవుని పై నిమగ్నం చేయాలి వేరే ఏ ఆలోచనలు రానివ్వరాదు. మనం పూజ చేసే సమయంలో చేతులు, కాళ్ళు, ముఖ్యంగా మనస్సును మన అదుపులో ఉంచుకోవాలి.ఇతరుల పట్ల దయ, సానుభూతి, స్నేహ భావం లేని వారు దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఎంత ఖర్చు చేసి యజ్ఞాలు చేసినా వ్యర్ధమే అవుతుంది. అటువంటి దయాహీనులైన వారి పూజలను దేవుడు స్వీకరించడు. అటువంటి వారికి పూజా ఫలం దక్కదు. కష్టాల్లో ఉన్న వారికి చేసే సహాయం మనకు వందరెట్ల పూజా  ఫలాన్ని ఇస్తుంది. దేవుడి యొక్క అనుగ్రహం అటువంటి వారిపై నిరంతరం ఉంటుంది.
దేవునికి కావలసింది భాహ్య ఆర్బాటం కాదు. అంతరంగిక ఆర్భాటం... మనసు నిర్మలంగా ఉంచుకొని చేసే పూజ ఆ దేవుడి కృప ని పొంది మంచి ఫలితాన్ని అందిస్తుంది. అంతే కాకుండా సంధ్యా సమయంలో చేసే పూజ పుణ్యాలను చేకూరుస్తుంది. సాయంకాలం పూట దీపారాధన ఖచ్చితంగా చేయాలి. చీకట్లు కమ్ముకునే సమయాన ఇంట్లో దీపం వెలిగించడం మంచిది. ఈ విధంగా మీరు పూజ చేయడం వలన భగవంతుడు మీరు కోరిన వరాలను తీరుస్తాడు. మరియు మీ కుటుంబం ఎప్పుడూ సుఖసంతోషాలతో జీవిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: