మహాభారతంలో ఈ విషయాలు గురించి తెలుసా...?

VAMSI
నాటికీ నేటికీ ఏ నాటికీ..మహాభారతం అనే మహా కావ్యం గురించి తెలియని హిందూ మతస్థులు ఉండరనే చెప్పాలి. పసిపిల్లల నుండి పెద్ద వయస్సు వారి వరకు ఇప్పటికీ అందులోని కథలను వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరియు ఇందులోని విలువలను, నీతిని ఎంతో చక్కగా పలువురికి చెబుతూ ఉంటారు. ఇందులో మంచి ఉంది మరియు చెడు ఉంది. కానీ మనకు ఏది అవసరమో దానినే మనము తీసుకోవాలి. అంతే కాకుండా ఈ మహాకావ్యం నుండి మనము ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలుస్తుంది. అంతే కాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. అయితే చాలా మంది మహాభారతం అంటే కేవలం పాండవులకు మరియు కౌరవులకు జరిగిన యుద్ధం అనే అనుకుంటారు. కానీ ఇందులో మనకు తెలియని ఎన్నో బంధాలు అనుబంధాలు ప్రేమానురాగాలు ముడిపడి ఉన్నాయి. మరి అవేమిటో ఒక్కసారి తెలుసుకుని పరవశించిపోదామా...!
ఇందులో ముఖ్యంగా మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తి శ్రీకృష్ణుడి ప్రేమాయణం గురించి తెలుసుకుందాము. విదర్భ మహారాజు భీష్మకుడి కూతురు రుక్మిణి దేవి. అయితే మొదట్లోనే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు ఒకరినొకరు ఇష్టపడతారు. గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి సోదరుడు అయిన రుక్మి శ్రీకృష్ణుడిపై వైరాన్ని పెంచుకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో రుక్మికి వ్యతిరేకంగా నిలిచిన రుక్మిణి దేవి, తన ప్రేమికుడు శ్రీ కృష్ణుడికి ప్రేమ లేఖను పంపుతుంది. ఈ లేఖను అందుకున్న శ్రీ కృష్ణుడు వెంటనే బలరాముడితో సహా ద్వారకా నుంచి బయలుదేరి విదర్భ కు వెళతాడు. అక్కడి నుండి రుక్మిణిని తీసుకెళ్లి ఇద్దరూ వివాహం చేసుకుంటారు. ఈ సంఘటనతో రుక్మిణి సోదరుడి శ్రీకృష్ణుడితో మరింత శత్రుత్వం పెరిగిపోతుంది. వీరి ప్రేమలో జరిగిన ఒక్కొక్క సంఘటన అద్భుతంగా ఉంటుంది.
దాని తరువాత అర్జునుడు మరియు సుభద్రల ప్రేమ .. సుభద్ర స్వయానా శ్రీ కృష్ణుడి సోదరి. ఈమె అర్జునుడిని ప్రేమిస్తుంది. ఈ కథలో కూడా సుభద్ర పెద్దన్నయ్య అయిన బలరాముడు ఒప్పుకోడు. ఎలాగైనా దుర్యోధనుడికిచ్చి వివాహం జరిపించాలని చూస్తాడు. అయితే ప్రేమ గురించి తెలిసిన శ్రీకృష్ణుడు సోదరి ఇష్ట ప్రకారం అర్జునుడికి ఇచ్చి పెళ్లిచేస్తారు. ఇందులో అర్జునిడికి ఉపాయాలను కూడా శ్రీకృష్ణుడే ఇస్తాడు. తానే ముందుండి సుభద్రను తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని అర్జునిడిని ప్రేరేపిస్తాడు. ఎలాగు వారిద్దరికీ రహస్యంగా వివాహం జరిగిపోతుంది. వీరిద్దరికీ పుట్టిన సంతానమే అభిమన్యుడు. వీరి తరువాత శ్రీకృష్ణుడి కుమారుడు సాంబా కుమారుడి ప్రేమ కూడా మహాభారతంలో రక్తి కట్టిందని చెప్పవచ్చు. ఇతను దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణ ని ప్రేమిస్తాడు. కానీ దీనికి దుర్యోధనుడు ఒప్పుకోడు. కాబట్టి ఓ రోజు సాంభా లక్ష్మణా వివాహం చేసుకొని ద్వారకాకు బయల్దేరుతాడు. తరువాత వీరిద్దరినీ కౌరవులు బంధిస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కల్పించుకుని వారిని విడిపిస్తారు. ఇలా వీరి ప్రేమ కూడా సుఖాంతమవుతుంది. ఇలా ఎన్నో ప్రేమ కథలు ఈ మహాభారతమనే మహాకావ్యంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: