ఏపీలో జరుగుతున్న దేవాలయాల దాడులపై చినజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఆలయాల వద్ద రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. దేవాలయల ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరిపించాలని.. ఎవరు తప్పు చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా కమిటీ ఉండాలని ఆయన కోరారు. ఆలయాలపై జరుగుతున్న దాడులపై కేవలం మఠాధిపతులే కాదు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అన్నారు. మతపరమైన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని.. రాజకీయం.. ఆధ్యాత్మికం రెండు వేరని చినజీయర్ స్పష్టం చేశారు. చర్చి, మసీదులపై దాడులు జరిగినా ఈ విధంగానే స్పందిస్తామని ఆయన అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలపై యాత్రను వాయిదా వేసుకున్నామని.. 17 నుంచి యాత్ర చేపట్టనున్నట్లు స్వామీజీ చెప్పారు. తాము ప్రభుత్వానికి అనుకూలం కాదని.. అలాగని ప్రతికూలం కూడా కాదని స్వామీజీ తెలిపారు.