మీ వైవాహిక జీవితంలో సమస్యలున్నాయా...?

VAMSI
సాధారణంగా ప్రతి సంవత్సరం హిందువుల క్యాలెండర్ లో ఎన్నో మంచి రోజులు మరియు పండుగలు వస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ఏన్నో పండుగలు జరుపుకున్నాము. ఇప్పుడు మరో ముఖ్యమైన పండుగ వచ్చేసింది. దీనినే చంపా షష్ఠి పండుగ అంటారు...దీనికి మరొక పేరు కూడా ఉంది స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. ఇది ప్రతి ఏటా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున వస్తుంది. ఈ షష్ఠి ఈ సంవత్సరం డిసెంబర్ 20 వతేదీన వచ్చింది. ఈ పండుగను భోళా శంకరుడు శివునికి అంకితం చేయబడింది.

ఈ పండుగను మన రాష్ట్రంలో కన్నా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగ నాడు ఎవరిని పూజిస్తారో తెలుసా.. సాక్ష్యాత్తు శివుడి కుమారుడైన కుమారస్వామి ని పూజిస్తారు.  ఇంతకీ ఈ పండుగకు ఆ పేరెలా వచ్చింది...సుబ్రహ్మణ్య స్వామి వివాహం ఎంతో వైభవంగా జరిగింది..దీనికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. చంపా షష్టి డిసెంబర్ 20వ తేదీ నాడు ఆదివారం మధ్యాహ్నం 2:15 నుండి 2:50 గంటలకు శుభ ముహుర్తం ఉంటుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు మరియు అశ్వతు స్థూపంపై పాము విగ్రహాన్ని పూజిస్తారు. కర్నాటకలోని కుక్కే సుబ్రమణ్య క్షేత్రం నాగ పూజకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ మట్టిని ప్రసాదంగా ఇస్తారు. నాగదోషం ఉండేవారు మరియు కుజదోషం ఉండేవారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. ఒకవేళ మీ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరువాత శివుడిని ఎంతో భక్తితో పూజించాలి. అంతేకాకుండా ఈ శుభ దినాన శివాలయానికి వెళ్లి శివుడిని ఆరాధించాలి. దీనితో మీకు ఆర్ధిక సమయాలు ఉంటే తీరిపోతాయి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: