యూరియాతో పండించిన ఆహారం తినడం వల్ల ఇన్ని నష్టాలా..?

Divya
ఒకప్పుడు రైతులు పంటలు సాగు చేయాలి అంటే ఎరువుని ఎక్కువగా ఉపయోగించి వేసేవారు. లేకపోతే పంట వేసే వాటిని బట్టి అందుకు అవసరమైన ఎరువుని పొలాలకు తోలేవారు. అంతేకాకుండా కాలువ నీరు ద్వారా పండించడం వల్ల పండే పంట కూడా చాలా పోషకాలు కలిగి ఉండేవి. దీనివల్ల నీరు శాతం కూడా తగ్గకుండా ఉండేది. అయితే ఇప్పుడు రాను రాను రైతులు సాగు చేసే పంటలకు అవసరానికి మించి యూరియ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలానే నష్టాలు వస్తున్నాయని ముఖ్యంగా అధికంగా యూరియా వాడడం వల్ల దిగుబడులు పెరగక పంటలో రసాయన అవశేషాలతో నిండిపోతున్నాయని ఇటీవల తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు సైతం తెలియజేశారు.


రైతులు అధికంగా యూరియాతో పండించే పదార్థాలను తినడం వల్ల చాలామంది కొత్తగా పెళ్లయిన జంటలకు సంతానోత్పత్తి శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందని, యూరియా వాడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ వ్యాధులు ,క్యాన్సర్ వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పండించే భూములు కూడా కలుషితమవుతున్నాయని తెలియజేస్తున్నారు. 2022లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ఈ అంశాన్ని పేర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. పంటలకు నత్రజని అవసరమే , కానీ యూరియా  చౌకగా లభిస్తోందని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆ పంట చాలా కలుషితం అవుతుందని తెలియజేస్తున్నారు. అందుకే యూరియాని మోతాదుకు మించి ఉపయోగించవద్దని సూచించారు.



ఇటీవల ఒక పరిశోధనలో వివాహమైన జంటలు చాలామంది సంతానం లేని సమస్యలను ఎదుర్కొంటున్నారని,  సంతానం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఎనిమిది మంది జెంటలలో రెండు జంటలు ఈ సమస్యనే ఎదుర్కొంటున్నాయని తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య కూడా పెరిగి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ సహజ సంతాన సామర్ధ్యం కూడా తగ్గిపోతోందని అలాగే మద్యం సేవించడం, ధూమపానం, అధికంగా కెఫీన్ పదార్థం కలిగిన వాటిని తీసుకోవడం వల్ల కూడా ఈ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: