శ్రీ కృష్ణుడు కంసుడుని ఎందుకు చంపాడో తెలుసా...?

VAMSI
మనకు పురాణాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం భగవంతుడయిన శ్రీ మహా విష్ణువు భూమి మీద జరుగుతున్న అన్యాయాలను అడ్డుకునేందుకు  రక రకాల అవతారాల్లో జన్మించి భూమి మీదకు రావడం జరిగింది.  అదే సమయంలో ఒకానొక అవతారమైన శ్రీ కృష్ణుని అవతారంలో తన చిన్న వయసులోనే తనకు మేనమామ అయినటువంటి కంసుడిని వధిస్తాడు. అయితే  ఇక్కడ సందేహం ఏమిటంటే తన మేనమామను శ్రీ కృష్ణుడు ఎందుకు చంపాడు. దీని వెనకున్న కారణాలు ఎవరికీ తెలియదు...ఇప్పుడు మనము ఏపీ హెరాల్డ్ అందిస్తున్న ఆర్టికల్ ద్వారా ఇవి తెలుసుకోబోతున్నాము.
 మొదటి నుండి కంసుడు శక్తివంతమైన దుష్ట పాలకుడు. తన పాలనలో ఎన్నో చెడ్డ పనులు చేసాడు. ఎవరో కనబడని వ్యక్తి చెప్పిన మాటలకు తన చెల్లెల్లికి పుట్టిన బిడ్డలను అతి కిరాతకంగా చంపేస్తాడు. ఈ సందర్భంలోనే శ్రీ కృష్ణుని తల్లి తండ్రులు దేవకి, వసుదేవుడిని ఒక చెరసాలలో బంధిస్తాడు. అయితే శ్రీక్రిష్ణుడు పుట్టిన విషయం మాత్రం తనకు తెలియకుండా వారు జాగ్రత్తపడతారు. శ్రీ కృష్ణుడి జననం గురించి తెలుసుకున్న కంసుడు అక్కడ రేపల్లెలోని పిల్లలందరినీ చంపేస్తాడు. ఈ నేపథ్యంలో ఒక అందమైన అమ్మాయిని కూడా హత్య చేస్తాడు. అంతటితో ఆగకుండా ఒక రాక్షసిని ఆ ఊరి మీదకు పంపి తన పాలలో విషమిచ్చి పిల్లలందరినీ చంపిస్తాడు.
మాయదారి క్రిష్ణుడు మాత్రం అదే సమయంలో ఆమె శరీరంలోని పాలతో పాటు తన రక్తాన్నంత పీల్చేసి తనను చంపేస్తాడు. ఆ తర్వాత పెరిగి పెద్దయిన శ్రీక్రిష్ణుడు కంసుని రాజ్యానికి తన అన్న బలరాముడితో కలిసి వెళ్తాడు. అప్పటికే వాళ్లను చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసుంటాడు కంసుడు. కానీ ఫలితం మాత్రం శూన్యమేనని తనకు తెలియదు. శ్రీక్రిష్ణుడు ఇన్నాళ్లు మామయ్య అన్న ఒకేఒక్క కారణంతో నీ దుశ్చర్యలను సహించాను. ఇక సహించను అని కంసుడిని చంపేస్తాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు మధుర రాజ్యానికి రాజుగా మారతాడు. ఈ విధంగా తాను చేసిన పాపాలకు శ్రీ కృష్ణుడు శిక్షను విధిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: