గుడిలో గంటను ఎందుకు కొడతారో తెలుసా.. ?

VAMSI
గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్లినపుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడి దర్శించుకొని రారు. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు. భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు ముఖ్యమైన పూజలు చేనిపుడు గంటను కొడతారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు. గంట కొట్టడం వల్ల ప్రయోజనమేంటి అనే సందేహం అందరికి కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

భగవంతుడు ముందు గంట కొట్టడం వలన ఆ శబ్ధం ఆ ప్రాంతంలో ఉన్న దుష్టశక్తుల, నెగిటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటుంటారు. అంతే కాదు దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకుని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్నీ శుభాలకు సంకేతం అని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ, ఇండ్లలో చేసుకునే ప్రత్యేక పూజలలో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతి దేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అన్ని దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. అందుకే హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షగా దర్శించాలి అని పూజారులు చెబుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: