హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి వేళ.. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కిటకిటలాడుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి అశేష భక్తజనులు తిరుమలకు చేరుకుంటున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల వీధులు మార్మోగుతున్నాయి.
శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. సామన్యుల నుంచి వీఐపీల వరకూ తిరుమలకు క్యూ కట్టారు. చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో తితిదే దుప్పట్లను పంపిణి చేసింది.
క్యూలైన్లు, షెడ్లలో వేచి ఉన్న భక్తుల కు అన్న ప్రసాదం, మంచి నీరు, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తోంది. భక్తుల సౌకర్యార్థ్యం తిరుమలలో 26 చోట్ల అన్న వితరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు, 1300 మంది స్కౌట్స్ తోపాటు తితిదే భద్రత సిబ్బంది, తిరుపతి అర్బన్ పోలీసుల సమన్వయంతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: