తమిళనాడు ఉత్సవంలో అపశ్రుతి...

Gowtham Rohith
తమిళనాడు ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కాంచీపురం లోనే అత్తివరధర్ రాజస్వామి ఉత్సవంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా మరి కొంత మంది గాయపడ్డారు.గుంటూరు జిల్లాకు చెందిన మహాలక్ష్మి అనే మహిళ కూడా ఈ ఘటనలో మృతి చెందారు.


 గాయపడ్డ వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పత్తివరద రాజస్వామి ఆలయంలో ప్రతి నలభై ఏళ్ళకోసారి ఈ ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారి పురాతన విగ్రహాన్ని కోనేటీ నుంచి ఆలయ అర్చకుల బయటకు తీసి నలభై ఇరవై ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేపడతారు. 


అనంతరం కోనేటి అడుగుకు పంపిస్తారు.అయితే ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఉత్సవాల్లో పద్దెనిమిదవ రోజు అవడంతో పాటు, శ్రవణా నక్షత్రం రావడంతో, స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువ అవటంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: