స్మరణ: రెండవ సినిమాకే నంది అవార్డు... ఎవరో తెలుసా?

VAMSI
తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది గొప్ప గొప్ప నటీనటులు తమ సేవలు అందించారు. వారిలో ఒకరు తెలంగాణ శకుంతల, చాలా మంది నటుల లానే ఈమె కూడా నాటకాల నుండి సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఈమెకు సినిమాలలో నటించాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ వెళ్లే దారి తెలియదు. అయితే నటనపై పిచ్చితో నాటకాల వైపు తన అడుగులు వేసింది. ఆ విధంగా "ఒంటి కాలు పరుగు" అనే నాటకం ద్వారా తనలోని నటిని బయటకు తీసుకువచ్చింది. ఈ నాటికలో నటించడానికి తనకు సాయం చేసిన వల్లం నాగేశ్వరావు గారు, ఈయన నటుడు మరియు దర్శకుడు కూడా కావడం విశేషం. ఆ తర్వాత శకుంతల పద్యాలను కూడా చదవడం చెప్పడం నేర్చుకుంది.

ముఖ్యంగా అప్పుడు నాటకాలలో ఎక్కువగా పద్యాలూ చెప్పవలసి వచ్చేది. అలా అందులో కూడా ప్రావీణ్యురాలు అయిన తర్వాత  శ్రీ కృష్ణ తులాభారం, మహాకవి కాళిదాసు నాటకాల్లో సత్యభామ మరియు విద్యాధరిగా నటించి మెప్పించింది. 1979 లో మొదటి సినిమా "మా భూమి" తో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఈమె సినిమా జీవితంలో మొత్తం 75 సినిమాల్లో నటించి తెలుగు ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేశారు. తాను నటించిన రెండవ సినిమా అయిన "కుక్క" లో తన నటనకు గానూ ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది.  ఈమె పేరు శకుంతల అయినప్పటికీ తాను నటించిన సినిమాల్లో ఎక్కువగా తెలంగాణ యాసను మాట్లాడుతుండడంతో  తెలంగాణ శకుంతల గా గుర్తింపు పొందింది.

ఈమె చేసిన చాలా పాత్రలు ప్రేక్షకులను నవ్వు తెప్పించాయి. ఒక హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా పాత్ర ఏదైనా తన దైన శైలిలో నటించి రక్తి కట్టించేది.  అలా తన సినిమా జీవితాన్ని 35 సంవత్సరాల పాటు కొనసాగించింది. 14 జూన్ 2014 న హైదరాబాద్ లోని కొంపల్లి లో గుండెపోటు రావడం తో హాస్పిటల్ కు వెళ్ళింది. కానీ మళ్లీ తిరిగి రాలేదు. ఆల ఈ తెలుగు సినిమా పరిశ్రమ ఒక మంచి నటీమణిని కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: