స్మరణ: సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు ?
కానీ ఉద్యోగం చేస్తున్నా తన మనసుకి ఏదో లోటు. ఆ తరువాత నాటకాల కోసం, తాను ఆశపడిన జీవితం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆకాశవాణి మరియు దూరదర్శన్ లలో నాటకాలు రాయడం మొదలెట్టాడు. ఆ విధంగా పలు నాటకాలు రాశాడు. ముఖ్యంగా దూరదర్శన్ లో "ఆనందో బ్రహ్మ" తో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు. ఈ నాటకం ద్వారా జంధ్యాల సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా నుండి వెనక్కు తిరిగి చూసింది లేదు. అప్పట్లో జంధ్యాల సినిమాలో నటించడం అంటే మాటలు కాదు. ఇక అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాను నటించిన అనేక పాత్రలలో కొన్ని పాత్రలు మాత్రం ఎప్పటికీ ప్రజల మనసులో గుర్తుండిపోతాయి.
అలాంటి వాటిలో ఒక్కడు సినిమాలో పాస్ పోర్ట్ అధికారిగా ఎంతలా నవ్వించాడో తెలిసిందే. వర్షం మరియు రెఢీ సినిమాలలో తన పాత్రలు అంతే హాస్యాన్ని పండించాయి. అలా తన ఆరోగ్యం బాగున్నంత వరకు సినిమాలలోనే నటించాడు. చవరికి కాలేయ సంబంధిత క్యాన్సర్ తో 7 డిసెంబర్ 2013 న తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. అలా ధర్మవరపు సుబ్రమణ్యం చనిపోయినా ఆయన చేసిన పాత్రల రూపంలో ఇంకా ప్రజల మనసుల్లో బ్రతికే ఉన్నాడు.